Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

By:  Tupaki Desk   |   25 Aug 2015 6:04 AM GMT
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
X
మెదక్ జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు పటోళ్ల కిష్టారెడ్డి (67) మంగళవారం ఉదయం ఎస్ ఆర్‌ నగర్‌ లోని ఆయన నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. స‌ర్పంచ్‌ గా రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డికి ఆజాత శ‌త్రువుగా పేరుంది. ఆయ‌న నారాయ‌ణ్‌ ఖేడ్ మండ‌లంలోని పంచ గ్రామంలో జ‌న్మించారు. ఆయ‌న బావ‌, దివంగ‌త కాంగ్రెస్ నేత‌, రాజ‌కీయ ఉద్దండుడు అయిన బాగారెడ్డి ద్వారా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కిష్టారెడ్డి ప్ర‌స్తుతం తెలంగాణ పీఏసీ చైర్మ‌న్‌ గా కూడా ఉన్నారు.

కిష్టారెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం:
- 1977లో పంచ గ్రామ స‌ర్పంచ్‌ గా ఎన్నిక‌
- 1982 నారాయ‌ణ్‌ ఖేడ్ స‌మితి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌
- 1989లో కాంగ్రెస్ నుంచి నారాయ‌ణ్‌ ఖేడ్ ఎమ్మెల్యేగా విజ‌యం
- 1989 విజ‌యం త‌ర్వాత‌ టీడీడీ బోర్డు స‌భ్యుడిగా ఉన్నారు.
- 1994ల‌తో కాంగ్రెస్ టిక్కెట్టు నిరాక‌ర‌ణ ... ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి ఓట‌మి
- 1999లో ఖేడ్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున రెండోసారి ఎమ్మెల్యే గా విజ‌యం
- 2009 కాంగ్రెస్ నుంచి మూడోసారి ఎమ్మెల్యే గా ఎన్నిక‌
- 2014 నాలుగోసారి ఎమ్మెల్యే గా విజ‌యం

టీడీపీ హ‌యాంలో రెండుసార్లు పీఏసీ చైర్మ‌న్‌ గా ప‌నిచేసిన ఆయ‌న, కాంగ్రెస్ పార్టీలో కూడా టీటీడీ బోర్డు మెంబ‌ర్‌ గా అనేక ప‌దువులు నిర్వ‌హించారు. 2014లో తెలంగాణ వ్యాప్తంగా తెరాస గాలి వీచినా ఆయ‌న గెలిచారంటే ఆయ‌న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. మృదుస్వ‌భావిగా ఆయ‌న‌కు పేరుంది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంట‌నే ప‌లువురు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఆయ‌న మృతికి సంతాపం తెలిపారు.