Begin typing your search above and press return to search.
రేవంత్‌ను ఓడగొట్టినోళ్లు.. కాంగ్రెస్‌లోకి!!
By: Tupaki Desk | 17 Jun 2023 2:10 PM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. రాజకీయంగా అనేక సంచలన మార్పు లు తెరమీదికి వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణను ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజుల పట్టం కట్టే అవకాశం ఉందని లెక్కలు వినిపిస్తున్న సమయంలో ఈ పార్టీలో చేరేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. ప్రజల మూడ్‌ను కూడా గమనిస్తున్న నాయకులు భేషజాలకు పోకుండా.. పార్టీలు మారేందుకు రెడీ అవుతున్నారు.
ఇలాంటి వారిలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గం కీలకంగా మారింది. ఈ వర్గానికి ప్రత్యేకత ఏంటంటే... ప్రస్తు తం తెలంగాణ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డిని కొడంగల్ నియోజకవర్గంలో ఓడించడమే! 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో అప్పటిటీఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడించారు. ఈ ఓటమికి.. పట్నం మహేందర్‌రెడ్డి కూడా వ్యూహాలు అమలు చేశారు.
అప్పట్లో సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు సంపాయించుకునేందుకు ఉత్సాహం చూపించిన పట్నం కుటుంబం.. ఈ క్రమంలోనే రేవంత్‌పై తీవ్రస్థాయిలో యుద్ధం ప్రకటించి మరీ.. ఆయనను ఓడించారు. దాదాపు 9 వేల పైచిలుకు ఓట్ల తేడాతో రేవంత్‌ను ఓడించారు. ఇదిలావుంటే... నాలుగేళ్లు గడిచేసరికి.. పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి.. అధినేత కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. తనను పట్టించుకోవడం లేదని.. పట్నం మహేందర్ వాపోతున్నారు.
ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన భార్య సునీత జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇక, పట్నం నరేందర్ రెడ్డి సొంత బంధువే కావడం విశేషం. ఈ క్రమంలోనిన్నమొన్నటి వరకు రేవంత్‌పై విరుచుకుప డిన పట్నం బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ.. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి జంప్ చేసేందుకు ఉత్సాహంగా పావులు కదుపుతున్నారు. తాండూరు, పరిగి టికెట్లను పట్నం మహేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే.. దీనికి బీఆర్ ఎస్ అంగీకరించడం లేదని సమాచారం.
ఈ క్రమంలోనే పట్నం.. వర్గం రేవంత్‌తో ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. తాము.. కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు ఉమ్మడి వికారాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తన వెంట భార్య వచ్చే అవకాశం ఉంది. అయితే.. మిగిలిన వారిని కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి.. బీఆర్ ఎస్‌కు షాక్ ఇవ్వాలని మహేందర్ ఆలోచనగా ఉంది.దీంతో గత పదిహేను రోజులుగా ఆయన తనవర్గాన్ని కాంగ్రెస్‌వైపు మళ్లించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి రేవంత్‌ను ఓడించేందుకు కలసి కట్టుగా ప్రయత్నించిన వారే... ఇప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు రెడీ అవుతుండడం గమనార్హం.