Begin typing your search above and press return to search.

ఉద్యోగం చేస్తున్న‌ మీరు క‌న్యేనా? యూనివ‌ర్సిటీ ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   2 Aug 2017 4:41 PM GMT
ఉద్యోగం చేస్తున్న‌ మీరు క‌న్యేనా? యూనివ‌ర్సిటీ ప్ర‌శ్న‌
X
``మీరు క‌న్యేనా? మీకు ఎంత మంది భార్య‌లు ఉన్నారు? మీరు భ‌ర్త‌ను కోల్పోయారా? `` ఉద్యోగుల వైవాహిక జీవితాలకు సంబంధించిన డిక్లరేషన్‌ లో అందరూ విస్తుపోయేలా వింత ప్రశ్నలడిగింది బీహార్‌ లోని ఇందిరా గాంధీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్. ”మీరు అవివాహితులా? వితంతువులా? కన్యయేనా (వర్జిన్‌)” అంటూ ప్రశ్నించింది. ”భార్య జీవించి లేని వ్యక్తిని వివాహం చేసుకున్నాం” అని, ”ఒక భార్య కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నాను” అని డిక్లరేషన్‌ పత్రంలో పేర్కొని ఉద్యోగులను డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరింది. మెడిక‌ల్ ఇన్స్‌స్టిట్యూట్ త‌న డిక్ల‌రేష‌న్‌ లో ఇంకా అనేక తిక‌మ‌క‌ ప్ర‌శ్న‌ల‌ను వేసింది. ఈ ప్ర‌శ్న‌లు ర‌చ్చ‌కు దారితీయ‌డంతో యూనివ‌ర్సిటీ వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చాయి.

వివాదానికి దారితీసిన డిక్ల‌రేష‌న్ ఫామ్ ప‌ట్ల హాస్ప‌ట‌ల్ సూప‌రిండెంట్ మ‌నీష్ మండ‌ల్ స్పందించారు. ఫామ్‌ను రూల్స్ ప్ర‌కార‌మే రూపొందించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉద్యోగి చ‌నిపోతే, క్లెయిమ్స్ ఎవ‌రి వెళ్లాల‌న్న ఉద్దేశంతోనే అలాంటి ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వం, రాజ్యాంగ‌మే రూల్స్‌ను త‌యారు చేస్తాయ‌ని, వాళ్లు మారిస్తే, తాము మారుస్తామ‌ని ఆయ‌న చెప్పారు. కాగా, ఇటీవలి కాలంలో ఇజిమ్స్‌ తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. కేన్సర్‌తో బాధపడుతున్న ఒక చిన్నారి మృతి చెందితే అంబులెన్స్‌ సౌకర్యం కల్పించడానికి తిరస్కరించి ఇజిమ్స్‌ వార్తల్లోకి ఎక్కింది.