Begin typing your search above and press return to search.
నితీశ్ సర్కారు సర్వేకు 'స్టే'తో షాకిచ్చిన పాట్నా హైకోర్టు
By: Tupaki Desk | 5 May 2023 9:20 AM GMTబిహార్ లోని నితీశ్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల చేపట్టిన సామాజిక సర్వే కు సంబంధించి హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం చేపట్టిన కుల గణన కు స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పై దాఖలైన మూడు పిటిషన్ల ను విచారించిన హైకోర్టు తాజా నిర్ణయాన్ని వెల్లడించింది. బిహార్ వ్యాప్తంగా కుల ఆధారిత సర్వేను చేపట్టాలని నితీశ్ సర్కారు నిర్ణయించుకోవటం.. ఇందుకు తగ్గట్లే మొదటి దశ సర్వేను పూర్తి చేసిన ప్రభుత్వం.. తాజాగా రెండో దశ సర్వేను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
దీనిపై అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ మూడు పిటిషన్లు పాట్నా హైకోర్టులో దాఖలయ్యాయి. వీటి పై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్.. జస్టిస్ మధురేశ్ ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం సర్వే మీద స్టే విధించటమే కాదు.. ఇప్పటివర కు సేకరించిన డేటాను భద్రంగా దాచి ఉంచాలని స్పష్టం చేసింది.ఈ వ్యవహారం పై తదుపరి విచారణను జులై మూడుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నితీశ్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కుల గణన పై హైకోర్టు నిర్ణయం ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.
నిజానికి కుల గణను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. కానీ నితీశ్ సర్కారు ఎన్నిసార్లు అడిగినా.. అందుకు మోడీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో నితీశ్ సర్కారు తామే ఈ సర్వేను చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.500 కోట్ల మొత్తాన్ని బడ్జెట్ కింద కేటాయించారు. బిహార్ లో కుల గణన కార్యక్రమాన్ని జనవరి ఏడున ప్రారంభించారు. అదే నెల 21 వరకు మొదటి దఫా కుల గణనను పూర్తి చేసిన ప్రభుత్వం రెండో సర్వేను ఏప్రిల్ 15 నుంచి మొదలు పెట్టారు. దీన్ని మే 15 వరకు నిర్వహించాల్సి ఉంది.
ఈ సర్వేలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి.. ప్రజల సామాజిక వర్గాల వివరాల్ని సేకరిస్తున్నారు. వారి కులం, విద్యార్హతలు.. ఆర్ధిక.. సామాజిక స్థితిగతుల నిర్ణయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సర్వే ఆధారంగా లభించిన సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైన పథకాల అమలు కార్యక్రమాల్ని చేపట్టాలని భావిస్తున్నట్లుగా నితీశ్ సర్కారు చెబుతోంది.
అయితే.. ఈ గణన పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనుమానాల్ని సంధిస్తున్నారు. తాము చేపట్టిన కులగణను వ్యతిరేకిస్తున్న వారిపై ముఖ్యమంత్రి నితీశ్ మండిపడుతున్నారు. వెనుక బడిన వర్గాలకు మెరుగైన సేవలు చేయటానికి వీలుండే సర్వేను వ్యతిరేకించటం సరికాదంటున్నారు. ఇదిలా ఉంటే బిహార్ ప్రభుత్వం చేపట్టిన సర్వే పై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వటం కచ్ఛితంగా ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.