Begin typing your search above and press return to search.

హాస్పిటల్ లో ధూంధాం చేశారు

By:  Tupaki Desk   |   1 March 2016 8:10 AM GMT
హాస్పిటల్ లో ధూంధాం చేశారు
X
హాస్పిటల్ అంటే నిత్యం కష్టాలు - కన్నీళ్లు - బాధలు - ఇబ్బందులతో కనిపిస్తుంది.. అక్కడ వివిధ జబ్బులతో బాధపడే రోగులుంటారు. డాక్టర్లు - నర్సులు - ఇతర సిబ్బంది వారిని నిత్యం కనిపెట్టుకుని ఉంటూ చికిత్స చేస్తేనే వారి ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు.. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యతా ఆసుపత్రి సిబ్బందిదే. కానీ, ఆసుపత్రి సిబ్బందే అక్కడి ప్రశాంతతకు భంగం కలిగిస్తే.... హోరెత్తించే డీజే - జోరెత్తించే డ్యాన్సులతో రెచ్చిపోతే అనారోగ్యంతో ఉండే రోగులకు ఎంత అసౌకర్యం. ఎంత ఇబ్బంది?... అయినా, అదేమీ పట్టించుకోకుండా తమ సంబరాల్లో తాము ములిగిపోయారు ఓ గవర్నమెంటు హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు. ఆ వీడియోలు ఇప్పుడ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సిబ్బంది యావత్తూ రోగులను ఏమాత్రం పట్టించుకోకుండా నృత్యాలు చేస్తూ, పెద్ద శభ్దాలతో పాటు పెట్టి హడావుడి చేసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ స్ప్రెడ్ అవుతోంది. బులంద్‌ షహర్‌ ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ఉద్యోగి ఒకరు ఆదివారం రాత్రి తన కుమార్తె వివాహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలోనే జరిపారు. ఆ సందర్భంగా సిబ్బంది మొత్తం నృత్యాలు చేస్తూ గడిపేశారు. మొత్తం కార్యక్రమం పూర్తయ్యే వరకు రోగులను ఎవరూ పట్టించుకోలేదట. సమయానికి ఇంజక్షన్ల వేయాల్సినవారు రాక, తమను ఎవరూ పట్టించుకో రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇంత జరిగినా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై నోరు మెదపడం లేదు.