Begin typing your search above and press return to search.

పతంజలి మందులు ఒక కుంభకోణమా?

By:  Tupaki Desk   |   24 Jun 2020 4:47 AM GMT
పతంజలి మందులు ఒక కుంభకోణమా?
X
మహమ్మారి వైరస్ లక్షలమంది ప్రాణాలు తీస్తున్నా ఇంతవరకు మందు కనిపెట్టలేకపోయారు. అన్ని దేశాల ఉద్దండ పిండాలైన శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి కనీసం వ్యాక్సిన్ అయినా తేవాలని విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. అది కూడా ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. మహమ్మారిను రోగనిరోధక శక్తిని పెంచుకొని కంట్రోల్ చేయడం తప్పితే దాని నుంచి కాపాడుకోలేని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది.

అయితే మహమ్మారి మాటున దాని భయాన్ని సొమ్ము చేసుకోవాలని చాలా మంది ఆయుర్వేద, చెట్ల ఔషధాలు, లేహ్యాల పేరిట మార్కెట్లోకి ఉత్పత్తులను తీసుకొచ్చి ఇది తింటే మహమ్మారి రాదని.. తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు. జనాల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా ఈ దందాలోకి ప్రముఖ దేశీయ ఆయుర్వేద కంపెనీ.. యోగా గురువు రాందేవ్ బాబా సారథ్యంలోని ‘పతంజలి’ కూడా దిగింది. తాము మహమ్మారికు ఆయుర్వేద మందును కనిపెట్టినట్టు పతంజలి సంస్థ కొన్ని టాబ్లెట్ లను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది. దీనిపై సీరియస్ అయ్యింది.

మహమ్మారిను నయం చేసే మందుగా పతంజలి చెప్పుకొస్తున్న ఈ మందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయవద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ పతంజలి సంస్థను ఆదేశించింది.ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలు, ఎక్కడ పరిశోధన చేశారు. ? వేటితో తయారు చేశారు? శాంపుల్ పరిమాణం సహా అన్ని వివరాలు వెల్లడించాలని కేంద్ర తాజాగా పతంజలి సంస్థకు అల్టిమేటం జారీ చేసింది.

తాజాగా పతంజలి తయారు చేసిన కొరొనిల్ మాత్రలు వాడితే రెండు వారాల్లో మహమ్మారి తగ్గుతుందని రాందేవ్ బాబా ప్రకటించడం దేశంలో సంచలనమైంది. 150 ఔషధ మొక్కలతో ఈ మందును తయారు చేసినట్లు పేర్కొంది. దీని కిట్ ధరను రూ.545గా నిర్ణయించారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మహమ్మారికు మందు లేదని.. ఇలా ప్రజల భయాలతో వ్యాపారం చేయడం పెద్ద కుంభకోణమని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. పతంజలి మందుపై కేంద్రం కూడా ఇదే రకంగా స్పందించడం గమనార్హం.