Begin typing your search above and press return to search.

దుమ్మురేపిన ప‌తాంజ‌లి బ్రాండ్ ఉత్ప‌త్తులు

By:  Tupaki Desk   |   1 Jan 2017 4:38 PM GMT
దుమ్మురేపిన ప‌తాంజ‌లి బ్రాండ్ ఉత్ప‌త్తులు
X
యోగా గురు బాబా రాందేవ్ స‌త్తాకు ఇది మ‌రో నిద‌ర్శ‌నం. యోగాతో వ‌చ్చిన క్రేజ్ తో ప‌తాంజ‌లి ఆయుర్వేదిక్‌ బ్రాండ్ ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన బాబా రాందేవ్ ఈ క్ర‌మంలో ఎఫ్ ఎంసీజీ రంగంలో దున్నేస్తున్నారు. ఏకంగా 146 శాతం వృద్ధితో 2016లో ఈ రంగంలో అత్యంత టాప్ లో ఉంద‌ని తాజాగా వెలువ‌డిన స‌ర్వే ఒక‌టి స్ప‌ష్టం చేసింది. అసోచాం-టెక్ సైన్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ మేర‌కు ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు.

$769 కోట్ల ఆదాయంతో ప‌తాంజ‌లి 146 శాతం వృద్ధి న‌మోదు చేసుకోవ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుందని అసోచాం రిపోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ మొత్తం ఐటీసీ - డాబ‌ర్‌ - హిందూస్తాన్ యూనిలీవ‌ర్‌ - ప్రోక్ట‌ర్ ఆండ్ గాంబిల్‌ - కోల్గెట్-పామోలివ్‌ ల మొత్తం మార్కెట్ ఆదాయానికి ఇది స‌మానం అని ఈ నివేదిక విశ్లేషించింది. ఈ బ్రాండ్ల‌న్నీ రెండంకెల వృద్ధిని సాధించేందుకు అవ‌స్థ‌లు ప‌డుతుంటే... ప‌తాంజ‌లి బ్రాండ్ మాత్రం దుమ్మురేపే రీతిలో 146 శాతం వృద్ధిని సాధించింద‌ని ప్ర‌శంసించింది. ప‌తాంజ‌లి బ్రాండ్ లో భాగంగా ముందుగా ఆయుర్వేదిక్ ఉత్ప‌త్తుల‌ను తీసుకువ‌చ్చేందుకు ఉద్దేశించిన‌ప్ప‌టికీ అనంత‌రం ద‌శ‌ల వారీగా ఇత‌ర ప్రొడ‌క్ట్‌ల‌ను ముఖ్యంగా కాస్మోటిక్ ల‌ను త‌యారు చేసింది. అలా ఆహార ఉత్ప‌త్తుల రంగంలోకి వ‌చ్చిన ప‌తాంజ‌లి అనంత‌రం కాలంలో ఈ మార్కెట్‌ లో త‌న‌ప‌ట్టును సాధించుకుంది. ఇలా మిగ‌తా సంస్త‌ల‌ను దాటివేసే స్థాయికి చేరింది అని అసోచాం నివేదిక విశ్లేషించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/