Begin typing your search above and press return to search.

భారత్ పై పాట్ కమిన్స్ ప్రేమ.. 50వేల డాలర్ల విరాళం

By:  Tupaki Desk   |   27 April 2021 1:30 AM GMT
భారత్ పై పాట్ కమిన్స్ ప్రేమ.. 50వేల డాలర్ల విరాళం
X
కోల్ కతా నైట్ రైటర్స్ తరుఫున ఆడుతున్న ప్రముఖ ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఉదారత చాటుకున్నారు. దేశాన్ని ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో దాని కొనుగోలుకు పీఎం కేర్స్ ఫండ్ కు 50వేల డాలర్ల విరాళం ప్రకటించాడు. భారత్ లో కరోనా వైరస్ రెండోసారి చెలరేగిపోతున్న నేపథ్యంలో ఇతర టాప్ ఆటగాళ్లు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.

భారత్ అంతే తనకు ఎంతో ప్రేమ అని.. భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కనీస బాధ్యత అని పాట్ కమిన్స్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆ ఉద్దేశంతో కరోనా కల్లోలంలో భారత్ లోని ఆస్పత్రులకు ఆక్సిజన్ కొనుగోలుకు తాను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం ప్రకటించినట్టు చెప్పాడు.

తాను చేసింది చాలా తక్కువ సాయం అని.. అయినా కొంతమందికైనా ఉపయోగపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తన వంతు సాయం ఇతర సహచరులను కూడా ప్రోత్సహిస్తుందని తెలిపాడు.పాట్ కమిన్స్ సాయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. కమిన్స్ కు నెటిజన్లు శాల్యూట్ చేస్తున్నారు. కమిన్స్ ను చూసి భారత ఆటగాళ్లు మేలుకోవాలని చాలా మంది చురకలు అంటిస్తున్నారు.