Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌ రికార్డ్ ధర పలికిన ఆస్ట్రేలియా బౌలర్..ఎన్ని కోట్లో తెలుసా..?

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:58 PM IST
ఐపీఎల్‌ రికార్డ్ ధర పలికిన ఆస్ట్రేలియా బౌలర్..ఎన్ని కోట్లో తెలుసా..?
X
నేడు 2020 ఐపీఎల్‌ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్స్‌ కమ్మిన్స్‌ జాక్‌ పాట్‌ కొట్టేశాడు. కమ్మిన్స్‌ కనీస ధర రెండు కోట్లు ఉండగా అతడు రూ. 15.50 కోట్ల భారీ ధర పలికాడు. కమిన్స్‌ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా చివరకూ కేకేఆర్‌ కమిన్స్‌ ను దక్కించుకుంది. అతనికి 10 కోట్ల వరకూ ధర పలుకుతుందని ఊహించనప్పటికీ అంతకుమించి అమ్ముడుపోవడం విశేషం.

ముఖ్యంగా కమిన్స్ కోసం రాయల్స్‌ చాలెంజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ సమయంలో కమిన్స్ ని ఎలాగైనా రాయల్స్‌ చాలెంజర్స్‌ దక్కించుకుంటుంది అని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా కమిన్స్ కోసం కేకేఆర్ కూడా పోటీలోకి దిగింది. కేకేఆర్‌ కచ్చితంగా కమ‍్మిన్స్‌ ను దక్కించుకోవాలనే దృఢ సంకల్పం తో అతని కోసం భారీ ధర వెచ్చించింది.ఫలితంగా రూ. 15 కోట్లకు పైగా కమ్మిన్స్‌కు ధర పలికింది. కాగా, ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ గుర్తింపు పొందాడు.