Begin typing your search above and press return to search.
గుడ్‌న్యూస్: తల్లికి పాజిటివ్ ఉన్నా ముర్రుపాలు పట్టొచ్చు
By: Tupaki Desk | 11 July 2020 7:10 AM GMTవైరస్‌పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ వైరస్ వ్యాప్తి.. దాని పరిణామ క్రమంపై తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అద్భుత వార్త తెలిసింది. తల్లిపాలలో వైరస్ ఉండదని తేలింది. ఈ విషయాన్ని కెనడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే పాశ్చరైజేషన్ చేసిన తల్లిపాలలో మాత్రమే వైరస్ ఉండదని స్పష్టం చేశారు.
ఈ పాలలో వైరస్ క్రియాశీలకంగా ఉండే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాలను తల్లిపాలకు దూరమైన శిశువులకు ‘తల్లిపాల బ్యాంకు’ల ద్వారా ఇస్తారు. తల్లిపాలను దానం చేసే మహిళల నుంచి వాటిని సేకరించి నిల్వ చేస్తారు. ఈ క్రమంలో వైరస్ సోకిన మహిళలు దానం చేసిన పాలను కూడా 62.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు పాశ్చరైజ్ చేసి వైరస్ పాలలో ఉండకుండా చేయొచ్చని కెనడా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. పాశ్చారైజ్డ్ చేసిన ఈ పాలను శిశువులకు ఇవ్వడం సురక్షితమేనని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రకటించింది. తల్లికి పాజిటివ్ ఉన్నా సరే శిశువుకు స్వయంగా పాలు ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.