Begin typing your search above and press return to search.
ప్యాసింజర్ వింత చర్య.. దెబ్బకు ఫ్లైట్ రద్దు..!
By: Tupaki Desk | 28 April 2021 9:30 AM GMT‘ఫలానా నదిలో చిల్లర నాణేలు వేస్తే మీ పాపాలన్నీ హరించుకుపోతాయి. ఫలానా రోజు ఫలానా నక్షత్రంలో ఆ గుడిని దర్శించుకుంటే మీకు అన్నీ లాభాలే కలుగుతాయి. ఓ పుణ్యక్షేత్రంలో ఒక్కరోజు నిద్ర చేశారంటే మీకు ఇక ఎదురే ఉండదు’.. మనదేశంలో చాలా మంది జ్యోతిష్య నిపుణులు, వాస్తు పండితులు తమ భక్తులకు ఇటువంటి పరిహారాలు చెబుతూ ఉంటారు. భక్తులు కూడా నమ్మకంతో వీటిని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఆచారాలు మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ ఉన్నాయి. చాలా దేశాల్లో ప్రజలు కొన్ని నమ్మకాలను ఆచరిస్తూ ఉంటారు.
ఇటువంటి ఓ గుడ్డి నమ్మకంతో ఓ చైనా పౌరుడు చేసిన పనికి విమానమే ఆగిపోయింది. ప్రయాణికులంతా ఓ రోజంతా అక్కడే పడిగాపులు గాయాల్సి వచ్చింది. విమానం ఇంజిన్ లో నాణేలు వేస్తే అంతా శుభమే జరుగుతుందని .. చైనాలో ఓ మూఢనమ్మకం వ్యాప్తిలో ఉంది. కానీ అలా చేస్తే ఇంజిన్ స్ట్రక్ అయ్యి.. విమానానికే ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది. కానీ భక్తులకు లాజిక్స్‌తో పనిలేదు. వాళ్లకు నమ్మకాలే ముఖ్యం. ఇటువంటి నమ్మకాన్ని గుడ్డిగా ఫాలో అయిన ఓ భక్తుడు విమానం ఇంజిన్ లో కాయిన్స్ వేశాడు. దీంతో సిబ్బంది విమానాన్ని రద్దు చేశారు.
చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న వీఫాంగ్ ఎయిర్ పోర్ట్‌లో.. బీబూ గల్ఫ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన జీఎక్స్ 8814 ఫ్లైట్ హైకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అయితే అంతలోనే అందులో ప్రయాణిస్తున్న వాంగ్ అనే ప్రయాణికుడు విమానం ఇంజిన్ లో కొన్ని కాయిన్స్ వేశాడు. ఓ పేపర్లో చుట్టి వీటిని ఇంజిన్‌లో పడేశాడు. ఈ విషయాన్ని విమాన సిబ్బంది గుర్తించి వెంటనే విమానం ఆపేశారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.ఇంజిన్ లో కాయిన్స్ వేస్తే శుభం కలుగుతుందని తనకు ఎవరో చెప్పారని అందుకే తాను అలా చేశానని చెప్పుకొచ్చాడు వాంగ్ . ఇతగాడు చేసిన పనికి 148 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వారు ఓ రోజంతా విమానాశ్రయంలోనే గడపాల్సి వచ్చింది. గతంలోనూ చైనాలో ఇటువంటి ఘటనలు జరిగాయని గుర్తుచేసుకున్నారు విమాన సిబ్బంది.