Begin typing your search above and press return to search.
హిందూపురమే ఇంత..బాలయ్యకైనా..వైసీపీకైనా!
By: Tupaki Desk | 3 Dec 2019 10:45 AM GMTతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ - ఆయన తనయుడైన సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు అచ్చివచ్చిన నియోజకవర్గంలో బాలయ్య ఎలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడో... ఇప్పుడు అదే తరహా చిత్రమైన సమస్యను అధికారంలో ఉన్న వైసీపీ సైతం ఎదుర్కుంటుందని ప్రచారం జరుగుతోంది. గతంలో - ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తీరుపై పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి. పార్టీలో తీవ్ర కలకలానికి దారితీసేందుకు కారణమవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులను మనస్థాపానికి గురి చేసినట్లు ఎద్ద ఎత్తున్నే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఇదే సమస్యను వైసీపీ నేత ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎదుర్కుంటున్నారని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో విజయం సాధించిన బాలకృష్ణ తాను స్థానికంగా ఉండడం వీలుకాదని చెప్పి పార్టీ వ్యవహారాలు - కార్యకర్తల అవసరాలు చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగి శేఖర్ ను వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. అంతేగాక నియోజకవర్గం పార్టీ బాధ్యతలను కూడా అప్పచెప్పారు. అయితే పిఏ శేఖర్ అంతాతానై వ్యవహరిస్తూ దశాబ్ధాల కాలంగా టీడీపీకి అండగా నిలిచిన సీనియర్లను సైతం విస్మరిస్తున్నారన్న ఆరోపణలు పార్టీలో వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు - మూడు నెలలకు ఒకసారి హిందూపురం వచ్చి ఒకటి - రెండు రోజులు ఉంటూ వెళ్ళిపోతుండటంతో పిఏ శేఖర్ సర్వం తానే అయిన వ్యవహరిస్తున్నారని పార్టీలోని అసంతృప్తివాదులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలంతా ఓ దఫా హైదరాబాద్ వచ్చి బాలయ్యకు ఫిర్యాదు చేశారు కూడా. అనంతరం కొద్దికాలానికి కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం బాలకృష్ణ విలేఖర్లతో మాట్లాడుతూ...తన వ్యక్తిగత కార్యదర్శి మీద వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ముందు తనతో పాటు అందరూ సమానమేనని అన్నారు. ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా అధిష్ఠానం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.
ఇలా బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి ఒంటెత్తు పోకడలపై హిందూపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో జరిగిన రచ్చ రచ్చ ఇప్పుడు అధికార వైసీపీలోనూ ఎమ్మెల్సీ ఇక్బాల్ కేంద్రంగా కొనసాగుతున్నట్లు సమాచారం. హిందూపురం నియోజకవర్గంపై పూర్తీస్థాయిలో పట్టు లేకపోవడంతో ఇక్బాల్ అనధికారికంగా ఇద్దరు పీఏలను నియమించుకున్నట్లు సమాచారం. అయితే, ఇక్బాల్ నియమించుకున్న అనధికార పీఏల తీరుపై క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్న కార్యకర్తలకు గుర్తింపు లేదని - స్థానిక నేతలను ఎమ్మెల్సీ పట్టించుకోవడం లేదని - ఓ వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని...ఓ ఫంక్షన్ హాలులో వైసీపీ నేతలు - కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి ఇక్బాల్ కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని పార్టీ ఇన్ చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి సైతం తీసుకుపోయినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్యాడర్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ ఎదుర్కున్న సమస్యనే భరిస్తున్న వైసీపీ దానికి ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే.