Begin typing your search above and press return to search.
ఓ వైపు ఎన్నికలు.... క్రికెట్ ఆడుకుంటోన్న రాహుల్
By: Tupaki Desk | 19 Oct 2019 1:54 PM GMTమరో రెండు రోజుల్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు బీజేపీ వ్యూహకర్తలు ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మళ్ళీ రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం కూడా జోరుగా చేశారు. ఇక అన్ని సర్వేలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరింత కష్టపడి పార్టీని ముందుకు నడిపించాల్సిన రాహుల్ గాంధీ అవేమీ పట్టనట్లు కనిపిస్తున్నారు. ఎన్నికలని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనబడటం లేదు.
సోనియా గాంధీ ఆరోగ్యం బాగోక ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అయితే మొత్తం బాధ్యత తీసుకుని పార్టీని నడిపించాలసిన రాహుల్ ...చక్కగా రోడ్డు పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఎన్నికలు ముందే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఎలా గెలవాలని వ్యూహాలు రచిస్తారు. కానీ రాహుల్‌కు అలాంటివి పెద్దగా తెలియదు అనుకుంటా. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజు ఆయన హెలికాప్టర్ అత్యవసరంగా రేవారిలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడ క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల వద్దకు రాహుల్ చేరుకుని వారితో క్రికెట్ ఆడారు.
దీనిపై బీజేపీ నేతలు సరదా కామెంట్లు చేయడంతో పాటు, సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు పెట్టుకుని రాహుల్ ఆడుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. ఇది పక్కనబెట్టేస్తే చేసిన ఎన్నికల ప్రచారం అయిన సరిగా చేశారంటే అది లేదు. ఏదో మొక్కుబడిగా సభలకు హాజరవ్వడం, బీజేపీ మీద పాత పాటే పాడటం. అదే రాఫెల్ కుంభకోణం, నోట్ల రద్దు అంశాలని టార్గెట్ చేసుకుని మోడీపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో రాహుల్ కు ఇంకా మెచ్యూరిటీ వచ్చినట్లు లేదు. ఏదో పిల్లాడిలా తీరిక దొరకగానే సినిమాలకు వెళ్ళడం, టూర్లకు వెళ్ళడం, ఇప్పుడు పిల్లలతో క్రికెట్ ఆడటం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.