Begin typing your search above and press return to search.
మహిళా బిల్లుపై మోడీ మార్క్ నిర్ణయం
By: Tupaki Desk | 4 March 2016 10:30 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో వివాదంలో చిక్కుకోనున్నారా? మహిళా రిజర్వేషన్ కోటా విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయం తాజాగా వివాదానికి కారణం కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో నిర్దిష్ట కాలపరిమితిలో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. దీనికి అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని పాత సాకును కేంద్రం చెప్పడం ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోసింది.
మహిళా బిల్లు ఆమోదం పొందేలా చూడడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అత్యంత జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. రాజ్యాంగ సవరణకై బిల్లు తీసుకురావడానికి ముందుగా దీనిపె ఏకాభిప్రాయం అవసరం అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సభకు రాతపూర్వక సమాధానమిచ్చారు. అయితే ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి చర్చల ద్వారా బిల్లు ఆమోదానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇటువంటి బిల్లు కూడా 15వ లోక్‌సభ రద్దు కావడంతో మురిగిపోయింది. చట్ట ప్రకారం, లోక్‌సభలో ఏ బిల్లు పెండింగ్‌లో వున్నా సభ రద్దయితే అది మురిగిపోతుంది. రాజ్యసభలో ప్రవేశపెట్టి పెండింగ్‌లో వున్న బిల్లులను లైవ్ రిజిస్టర్‌లో నమోదు చేసి ఉంచుతారు. అవి పెండింగ్‌లోనే వుంటాయి. గత 18ఏళ్ళుగా ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హై డ్రామా నడుస్తోంది. మోడీ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లుకు మోక్షం లభిస్తుందని ఆకాంక్షించారు. అయితే ఏకాభిప్రాయం అనే మాట చెప్పడమంటే తన బాధ్యతనుంచి తప్పించుకోవడమేనని భావిస్తున్నారు.