Begin typing your search above and press return to search.

పార్లమెంట్ భవనం ఓపెనింగ్ : ముహూర్తం బాగా లేదంటూ కొత్త డౌట్లు

By:  Tupaki Desk   |   24 May 2023 7:52 PM GMT
పార్లమెంట్ భవనం ఓపెనింగ్ : ముహూర్తం బాగా లేదంటూ కొత్త డౌట్లు
X
నరేంద్ర మోడీ బీజేపీ చరిత్రను మార్చిన వారు. లోహ పురుష్, వికాస పురుష్ అని పేరు గడించిన బీజేపీ ద్వయం ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్ పేయ్ వేసిన పునాదుల మీద బీజేపీకి సరికొత్త దూకుడు నేర్పిన వారు మోడీజీ. ఫుల్ మెజారిటీతో రెండు సార్లు బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ఘనత అచ్చంగా ఆయనదే.

ఇక దేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని మోడీ చరిత్ర పుటలలో నిలిచేలా ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం. అయోధ్యలో రామాయలం నిర్మాణం అందులో కొన్ని. ఇంకా మరి కొన్ని లిస్ట్ లో ఉన్నాయి. అవి కూడా మోడీయే చేయాలని చేస్తారని బీజేపీ ఆరెస్సెస్ ఆశగా ఉన్నాయి.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కూడా చరిత్రలో మోడీని గుర్తుంచుకునేలా చేస్తుంది. మూడేళ్ల క్రితం దానికి అంకురార్పణ జరిగింది. ఇపుడు అది కాస్తా ప్రారంభోత్సవం దాకా వచ్చింది. ఇది మోడీ మదిలో మెదిలిన వినూత్న ఆలోచన. అలాంటి పార్లమెంట్ భవనం ప్రారంభం విషయంలో ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా విపక్షాలు మేము రాము హాజరు కామని మొరయించేశాయి. ఇది అపశకునంగానే అంటున్నారు.

ఇపుడు చూస్తే పార్లమెంట్ భవనం ఓపెనింగ్ ముహూర్తం మంచిది కాదు అని నెట్టింట తెగ చర్చ సాగుతోంది. జ్యోతీష్యం బాగా తెలిసి ఉండనక్కరలేదు. ఆ ముహూర్తం చూసి ఇది మంచిది కాదని ఎవరైనా చెప్పేయగలరు అని ప్రియాంకా అనే ఆస్ట్రాలజీ గైడెన్స్ ఇచ్చే ఒకామె స్పందించారు.

ఈ నెల 28న 12 గంటలకు నూతన పార్లమెంటు భవన సముదాయన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఆహ్వాన పత్రిక విడుదల చేశారు.

ఇదే ఇపుడు చర్చకు కారణం అవుతోంది. ఇది మంచి ముహూర్తం కాదు అని ప్రియాంకా వాదిస్తున్నారు. అంతే కాదు దీని కంటే కూడా 11.25 నుంచి 11.50 గంటల వరకు కొంచెం వెనక్కి వెళ్తే మంచి ముహూర్తంగా అది ఉంటుందని ప్రియాంక తన ట్వీట్‌లో సూచించారు. దీని మీద నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. ముహూర్తం మంచిదే అని కొందరు అంటే పార్లమెంట్ హౌస్ ని ఓపెన్ చేస్తూ ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచించకుండా ఉంటారా అని మరికొందరు అంటున్నారు.

ఇంకొందరు అయితే మోడీ అమిత్ షాలకు కూడా ముహూర్తం తెలుసు అని అంటున్నారు. మంచి ముహూర్తమే పెట్టారని, దాన్ని వివాదం చేయడం తగదని అంటున్నారు. ఇల ముహూర్తం బాగాలేదు అన్న చర్చ అయితే ఇపుడు నెట్టింట యమ జోరుగా సాగుతోంది. సరే ముహూర్తాలు విశ్వసాలు పక్కన పెడితే రాజకీయంగా మాత్రం బీజేపీకి అంత మంచిగా ముహూర్తం లేదనే అంటున్నారు. దేశంలోని అందునా పార్లమెంట్ లో కీలకంగా ఉండే పందొమ్మిది పార్టీలు ఈ ఓపెనింగ్ కి దూరం అంటే అది పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

పార్లమెంట్ అంటేనే దేవాలయం. అన్ని పార్టీలకు అక్కడ అవకాశం ఉంది. ఒక మంచి కార్యక్రమం చేస్తూ అందరినీ ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కేంద్రం చేయాలసిన ప్రయత్నాలు చేశామని అంటున్నా విపక్షాలు మాత్రం రామనే అంటున్నారు. ఎందుకు అలా అంటే రాష్ట్రపతి ద్వారానే ప్రరంభించాలని వారు అంటున్నారు. ఏది ఏమైనా ముహూర్తం మంచిదా కాదా అన్నది ఈ వివాదమే ముందుగా చెప్పేస్తోంది అన్న వారూ ఉన్నారు. కొత్త పార్లెమెంట్ భవనంలో అయినా రాజకీయ రచ్చ తప్ప చర్చలు సజావుగా సాగవు అన్న అనుమానాలు భయాలు కూడా కలుగచేస్తున్నాయి.