Begin typing your search above and press return to search.

అడ్గగోలు పార్కింగ్ ఫీజులకు కట్టడి

By:  Tupaki Desk   |   26 Feb 2021 9:30 AM GMT
అడ్గగోలు పార్కింగ్ ఫీజులకు కట్టడి
X
మాల్స్, మల్టీపెక్సులు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తొలినాళ్లలో అమలైనప్పటికీ.. క్రమేణా తిరిగి పార్కింగ్ దందా మొదలైంది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం నిబంధనల ఉల్లంఘనపై చర్చలకు సిద్ధమైంది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది.

అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నట్టు తగిన ఆధారాలతో ఫొటోను ఆన్ లైన్ లో షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు పెనాల్టీ విధించినుంది. వీటితోపాటు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించని వాణిజ్య సంస్థల పైనా చర్యలు తీసుకోనుంది.

ఈ చర్యల అముకు ముందుగా మల్టీపెక్స్ లు, వాణిజ్యసంస్థలు, మాల్స్ లకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనుంది.