Begin typing your search above and press return to search.

ద‌మ్ము.. ధైర్యం క‌ల‌గ‌లిపిన‌ పంజాబ్ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   17 May 2019 7:08 AM GMT
ద‌మ్ము.. ధైర్యం క‌ల‌గ‌లిపిన‌ పంజాబ్ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఎంత పోటాపోటీగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు పోలింగ్ జ‌రిగిన వెంట‌నే ట్రెండ్ చెప్పేసే వారు. తాజా ఎన్నిక‌ల్లో ఫ‌లితాన్ని మ‌దింపు చేసే విష‌యంలో విప‌రీత‌మైన క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొని ఉంది. గెలుపు ధీమాను అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు ప్ర‌ద‌ర్శిస్తున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తుది ఫ‌లితాల‌పై పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

తాజాగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఒక స‌మావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్ లో కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు గెలిచే ప‌నిలో ఉన్న‌ట్లు చెప్పారు. పార్టీ అధినాయ‌క‌త్వం త‌మ‌పై పెట్టిన బాధ్య‌త‌ను నూటికి నూరు శాతం పూర్తి అయ్యేలా చేస్తామ‌న్నారు. పంజాబ్ లో పార్టీ ఓట‌మి చెందితే తాను బాధ్య‌త వ‌హిస్తూ త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పంజాబ్ లోని అన్ని ఎంపీ స్థానాల్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందన్న ధీమాను వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ‌.. తమ పార్టీ కానీ ఏ స్థానంలో అయినా ఓడిన‌ప‌క్షంలో.. తన ప‌ద‌విని వ‌దులుకుంటాన‌ని చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే.. పంజాబ్ లో మొత్తం 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఆరు స్థానాల్లో.. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో మాత్ర‌మే గెలుచుకుంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. తాజా ఎన్నిక‌ల్లో వీలైన‌న్ని ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని భావిస్తుంది. ఇదిలా ఉంటే.. మొత్తం 13 స్థానాల్లో తాము గెలుస్తామ‌న్న పంజాబ్ సీఎం మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఆయ‌న విసిరిన స‌వాల్ ఆయ‌న ఆత్మ‌విశ్వాసానికి ప్ర‌తీక‌గా చెబుతున్నారు. ఈ నెల 19న చివ‌రివిడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. పంజాబ్ సీఎం చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రి.. పంజాబ్ ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.