Begin typing your search above and press return to search.

పరిటాల వారసుడు.. పోటీ ఎక్కడ్నుంచి?

By:  Tupaki Desk   |   7 March 2019 10:00 PM IST
పరిటాల వారసుడు.. పోటీ ఎక్కడ్నుంచి?
X
తెలుగుదేశం పార్టీలో ఈసారి వారసులకు చోటులేదనే విషయాన్ని అధినేత చంద్రబాబు చూచాయగా అందరికీచెప్పేశారు. తన వారసుడు మాత్రమే బరిలో ఉంటారని - మిగతా నేతల కొడుకులెవరికీ ఈసారి సీట్లు ఆశించవద్దనిచెప్పేశారు. అయితే ఈ లిస్ట్ నుంచి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ ను మాత్రం మినహాయించారట బాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపై సమీక్ష నిర్వహించారు. అయితే పరిటాల శ్రీరామ్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేవిషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జేసీ కుటుంబం నుంచి ఇద్దరికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇటు పరిటాల కుటుంబం నుంచి కూడా సునీతతో పాటు శ్రీరామ్ కు టిక్కెట్ పక్కా అంటున్నారు. అయితే ఇప్పటివరకుశ్రీరామ్ విషయంలో క్లారిటీ రాలేదు.

పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీరామ్ మాత్రం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నారట. అలా కుదరకపోతే కల్యాణ దుర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నారట. హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్ప ఉన్నారు. ఈసారి ఆయన ఎంపీగా పోటీచేయడానికి ఇష్టపడడం లేదు. సో.. బాబు ఆశీస్సులు ఉంటే పరిటాల శ్రీరామ్ కు అతడు కోరుకున్న స్థానమే లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.