Begin typing your search above and press return to search.
ఆ విషయంలో ఓడిపోయామంటున్న సునీతమ్మ
By: Tupaki Desk | 29 Jan 2017 10:32 AM GMTమూడు పంటలు..తొమ్మిది లక్షల ఎకరాలలో పండించుకునేందుకు సాగునీరు ఇచ్చే వంశధార ప్రాజెక్టులకు నిర్వాసితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి - జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత అంగీకరించారు. సకాలంలో న్యాయం చేయకపోవడం వల్లే నిర్వాసితులు ఆందోళనకు దిగి, పనులు నిలిపివేశారని చెప్పారు. శ్రీకాకుళంలో పరిటాల సునీత విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు - ఉన్నతాధికారుల వైఫల్యం నిర్వాసితులను ఎంతగానో బాధించిందని, ఆ కారణంతోనే వారు వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈనెల 31వ తేదీ నాటికి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీని అందజేస్తామన్నారు.
వంశధార నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులంతా త్యాగధనులని, జిల్లా సస్యశ్యామలం కావడానికి వారి త్యాగం మరువలేనిదని మంత్రి పరిటాల సునీత తెలిపారు. నిర్వాసితులకు గతంలో రూ.420 కోట్లను మంజూరు చేయడం జరిగిందని, వాటిని కొన్ని సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేకపోయామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే నిర్వాసితులకు ఆలస్యంగా చెక్కులు పంపిణీ జరిగిందని మంత్రి సునీత అంగీకరించారు. దానికి మూలాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సర్వే బృందాలు నియమించి, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో వంశధార నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చేందుకు ఎంత ఖర్చైనా భరిస్తామంటూ భరోసా ఇచ్చారని సునీత తెలిపారు. ప్రస్తుతం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనంగా రూ. 193 కోట్లను అందిస్తున్నట్టు చెప్పారు. రైతులు ఎటువంటి అందోళనలు పడవద్దనీ, సమస్యలను తమ దృష్టికి తెస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, తప్పక పరిష్కరిస్తామని స్పష్టం చేసారు. ఎక్కడా ఇవ్వని విధంగా యూత్ ప్యాకేజీ కింద రూ. ఐదు లక్షలు చొప్పున అందిస్తున్నామని పరిటాల సునీత తెలిపారు. వారం రోజుల్లోగా పంపిణీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టు సమస్యల పరిష్కరించడానికి 19 టీములను ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు సోదరులు రెచ్చగొట్టే వారి మాటలను వినవద్దని - జలవనరులశాఖామాత్యులు - జిల్లా మంత్రులతో కలిసి మరొకసారి వస్తామన్నారు. నిర్వాసితులు సహకరించాలని, వారికి రావాల్సిన ప్రతీ రాయితీ తప్పక అందచేస్తామని తెలిపారు.
ఇదిలాఉండగా రాష్ట్రంలో 24.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 3,700 కోట్లను వారివారి ఖాతాలకు జమ చేశామని పరిటాల సునీత తెలిపారు. రైతులు దళారుల నమ్మి మోసపోరాదని, ఇప్పటివరకూ అమ్మకం జరిపిన రైతులకు సంక్రాంతిలోగా నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశామని చెప్పారు. అమ్మకం జరిపిని 48 గంటల్లోగా నగదును అందిస్తామన్నారు. పౌరసరఫరాలకు చెందిన సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు ఉన్నాయని వీటిని సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అనర్హులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందించనున్నట్లు పరిటాల సునీత తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/