Begin typing your search above and press return to search.

పరిటాల శ్రీరామ్ కు లైఫ్ లో ఊహించని షాకిచ్చిన కొడుకు!

By:  Tupaki Desk   |   24 April 2021 4:30 AM GMT
పరిటాల శ్రీరామ్ కు లైఫ్ లో ఊహించని షాకిచ్చిన కొడుకు!
X
తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. పరిటాల శ్రీరాం. తన తండ్రి ఇమేజ్ కు భిన్నంగా ఉంటారన్న పేరున్నా.. అప్పడప్పుడు కొన్ని వ్యవహారాల్లో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన పెళ్లి కావటం.. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా వెళ్లటం తెలిసిందే. ఈ మధ్యనే తండ్రి స్టేటస్ లోకి మారిన శ్రీరాంకు ఊహించని షాక్ తగిలింది.

తన జీవితంలో ఇలాంటి సందర్భం వస్తుందని ఆయన ఎప్పుడూ ఊహించి ఉండరు. ఇంతకీ జరిగిందేమంటే.. తన కుమారుడు రవీంద్ర (తండ్రి పేరును పెట్టుకున్నాడు) అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగోళ్ల సంప్రదాయం ప్రకారం.. అన్నప్రాశన రోజున.. బంగారం.. డబ్బు.. పుస్తకం.. ఆయుధం.. ఇలా పలు వస్తువులు పెట్టటం.. వాటిల్లో ఒకటి పట్టుకోవటం తెలిసిందే. అదే తీరులో ఈ రోజున రవీంద్ర అన్నప్రాశన నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి రవీంద్ర అనుకోని రీతిలో తండ్రి శ్రీరాంకు షాకిచ్చాడు.

అన్నప్రాశన రోజు అన్ని వస్తువులు ముందుంటే.. పాక్కుంటూ ముందుకు వెళ్లి.. నేరుగా కత్తిని పట్టుకోవటంతో శ్రీరాం అవాక్కు అయ్యాడు. ఆ సందర్భంగా పరిటాల శ్రీరాం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చూస్తే.. ఈ పరిణామాన్ని అతడేమాత్రం ఊహించలేదన్నట్లుగా ఉంది. కొడుకు కత్తి పట్టుకుంటే.. తండ్రి స్పందనను చూసిన ఆయన బంధువులు.. తెలుగుదేశం పార్టీ అభిమానులు నవ్వుకున్నారు. బుల్లి రవీంద్ర తీరును ఇప్పుడు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.