Begin typing your search above and press return to search.

ప‌రిటాల వారింట మ‌రో పెళ్లి సంద‌డి

By:  Tupaki Desk   |   30 March 2018 11:13 AM GMT
ప‌రిటాల వారింట మ‌రో పెళ్లి సంద‌డి
X
పరిటాల కుటుంబంలో మ‌రోసారి పెళ్లి బాజా మోగ‌నుంది. దివంగత నేత పరిటాల రవి - ఏపీ మంత్రి పరిటాల సునీతల ఏకైక కుమార్తె స్నేహలత త్వ‌ర‌లో పెళ్ళికూతురు కాబోతోంది. ప‌రిటాల ర‌వి సోద‌రి కుమారుడు హ‌ర్ష‌తో స్నేహ‌ల‌త నిశ్చితార్థం అనంతపురంలోని వెంక‌టాపురంలో గురువారంనాడు ఘ‌నంగా జ‌రిగింది. పరిటాల ఘాట్ వద్ద పూలమాలలు వేసి ర‌వికి నివాళులు అర్పించిన త‌ర్వాత ఆ నిశ్చితార్థ కార్య‌క్ర‌మం జ‌రిగింది. వేదమంత్రాల మధ్య స్నేహలత - హర్షలు పూలదండ‌లు మార్చుకున్నారు. మే 6న వెంక‌టాపురంలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జర‌గ‌బోతోంది. ఈ కార్యక్రమానికి మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు పలువురు నేతలు - అధికారులు - టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

ప‌రిటాల శ్రీ‌రామ్ వివాహం జ‌రిగిన ఆరు నెల‌లు తిర‌గ‌కుండానే వారి ఇంట మ‌రోసారి పెళ్లి సంద‌డి మొద‌లైంది. త‌న సోద‌రి కుమారుడితో స్నేహ‌ల‌త వివాహం జ‌రిపించాల‌న్న ప‌రిటాల ర‌వి ఆకాంక్ష ప్ర‌కారమే ఈ వివాహాన్ని నిశ్చ‌యించిన‌ట్లు తెలుస్తోంది. పరిటాల రవి సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు వ‌డ్ల‌మూడి హర్ష వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. స్నేహలత ఎండీ పూర్తి చేశారు. ప‌రిటాల కుటుంబం త్వ‌ర‌లోనే సొంత‌గా ఓ ఆస్ప‌త్రిని నిర్మించ‌బోతోంద‌ని, దాని బాధ్య‌త‌ల‌ను స్నేహ‌ల‌తకు అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. నిరుపేద‌లకు స‌కాలంలో వైద్యం అందించి, అవ‌స‌రంలో ఉన్న‌వారిని ఆదుకోవాల‌నే ల‌క్ష్యంతో ఆమె డాక్ట‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది.