Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు కసరత్తు.. ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   16 Sep 2021 2:30 PM GMT
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు కసరత్తు.. ఎప్పుడంటే?
X
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నీలం సాహ్ని కౌంటింగ్ కు వెంటనే కసరత్తు ప్రారంభించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల విడుదల దేదీపై ఎన్నికల సంఘం అధికారులతో రేపు చర్చలు జరుపున్నారు.

పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకటనకు క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పై ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. కౌంటింగ్ తేదీల ఖరారుపై అధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్ని రేపు సమావేశం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నిర్వహణ తేదీల ఖరారుపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నీలం సాహ్ని చర్చలు జరుపనున్నారు. సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

కౌటింగ్ చేపట్టేందుకు కావాల్సిన సిబ్బంది, భద్రతా చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఈనెల 18న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఆగిపోయిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో 515 జడ్పీటీసీ, 7321 ఎంపీటీసీ సీట్లకు కౌంటింగ్ జరుగుతుంది. తేదీని ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఏప్రిల్ 1న ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే21న తీర్పు ఇచ్చాడు.పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీచేసిన కొందరు అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీంతో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశించింది.

మే 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా హైకోర్టు స్టే విధించింది. గురువారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించవచ్చని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.