Begin typing your search above and press return to search.
చెమట వాసనతో వైరస్ ను పసిగట్టే కుక్కలు వచ్చేశాయట !
By: Tupaki Desk | 16 Jun 2020 2:30 AM GMTఈ భయంకరమైన వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందా అంటే అవుననే అంటున్నారు పారిస్ కు చెందిన పరిశోధకులు. వారు కొన్ని పరిశోధనలు చేసి ఈ విషయాన్నీ బయటపెట్టారు. ఇప్పుడు దీని ఆధారంగా వైరస్ రోగులను గుర్తించే పనిలో పడ్డారట. మనిషి చెమట వాసనతో వైరస్ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని తేల్చిన పరిశోధకులు, వాటి ద్వారా ఈ వైరస్ రోగులను గుర్తించడం ప్రారంభించారు.పేలుడు పదార్థాలు, బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్టే.. ఒక వ్యక్తికి వైరస్ సోకిందో లేదో గుర్తించే శునకాల వచ్చేశాయి.
ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో రోగ లక్షణాలు కనిపించక ముందే వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చారు. మనుషుల్లో మలేరియా, పార్కిన్సన్స్, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇందులో భాగంగా బెల్జియమ్ మలినోస్ షెపర్డ్ జాతికి చెందిన శునకాలకు అల్ఫోర్ట్ లోని నేషనల్ వెటర్నరీ స్కూల్ లో ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. చెమట వాసన చూసి ఈ వైరస్ ఉందో లేదో పసిగట్టేలా శిక్షణ ఇచ్చారు. వారి ప్రయత్నం వృథా కాలేదు. శునకాలు సక్సెస్ ఫుల్ గా పని చేస్తున్నాయి.
మొదటి దశలో కరోనా రోగులు, సాధారణ వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్ జాడను పసిగట్టే సామర్థ్యం కుక్కలకు ఉందో లేదో టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో 4 కుక్కలు పాస్ అయ్యాయి. 100శాతం రిజల్ట్స్ చూపాయి. 8 కుక్కల్లో 4 కుక్కలు వందకు వంద శాతం కరోనా పాజిటివ్ శాంపుల్ ఏదో ఇట్టే పసిగట్టాయి. ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువమందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని అధికారులు అంటున్నారు