Begin typing your search above and press return to search.

చెన్నై కోసం పారిస్ ఏం చేసిందో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Dec 2015 11:29 AM GMT
చెన్నై కోసం పారిస్ ఏం చేసిందో తెలుసా?
X
ఇటీవలే విషాదాన్ని ఎదుర్కొన్న రెండు ప్రాంతాలవి... ఒకటి ఫ్రాన్సులో పారిస్, రెండోది చెన్నై. ఉగ్రవాద దాడిలో వందలాది మంది మరణించగా ప్రాణాలు అరచేతలో పెట్టుకున్న పారిస్ నగరం ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేదు. అలాగే ఇండియాలోని చెన్నై... ఈ శతాబ్దంలోనే ఎన్నడూ కురవనంత వర్షాలు కురవడంతో రోజుల తరబడి నీళ్లలో నానిపోయింది. ఇళ్లు, చెరువులు ఒక్కటయ్యాయి. వందలాది మంది చనిపోయారు. తినడానికి తిండి లేక, నిద్రపోవడానికి స్థలం లేక లక్షలాది మంది నానాబాధలు పడ్డారు. చెన్నై ఇంకా ఆ విషాదంలోనే ఉంది. అలాంటి చెన్నై నగరానికి సాయమందించడానికి పారిస్ నడుం కట్టింది. ఆశ్చర్యంగా ఉందా...? ఎక్కడ పారిస్!! ఎక్కడ చెన్నై!! అనుకుంటున్నారా.. కానీ, నిజం. చెన్నై ప్రజలకు సాయమందించడానికి పారిస్ ప్రజలు నడుం బిగించారు. ఆన్ లైన్లో ఫండ్ రైజింగ్ చేస్తున్నారు.

ఉగ్రదాడి తాలూకు భయంనుంచి, బంధువులను కోల్పోయామనే బాధనుంచి ఇంకా కోలుకోకుండానే, ఇతరుల బాధలను తమవిగా భావించి ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు పారిస్‌ ప్రజలు. చెన్నైలో భారీ వర్షాలు, వరద భీభత్సం కారణంగా నిరాశ్రయులైన వారికోసం పారిస్‌వాసులు తపన పడుతున్నారు. వారికి చేతనైనంత సహాయం చేయడానికి ఉద్యుక్తులయ్యారు. 'షేర్‌ ఫర్‌ చెన్నై' పేరిట నిధుల సేకరణ కోసం ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ఆరంభించారు. పారిస్‌వాసులు తమ భోజనాన్ని చెన్నైవాసుల కోసం త్యాగం చేస్తున్నారు. వారి చొరవకు ఇప్పుడు ప్రపంచం సలాం అంటోంది.