Begin typing your search above and press return to search.

తల్లిదండ్రులూ..ఇది విన్నారా! వీడియోగేమ్స్ ​తో మేధస్సు పెరుగుతుందట!

By:  Tupaki Desk   |   6 Sep 2020 10:30 AM GMT
తల్లిదండ్రులూ..ఇది విన్నారా! వీడియోగేమ్స్ ​తో మేధస్సు పెరుగుతుందట!
X
వీడియోగేమ్స్​తో పిల్లల బుద్ధి వికసిస్తుందట. కమ్యూనికేషన్​ స్కిల్స్​ కూడా పెంచుతుందట. ఇంతకాలం వీడియోగేమ్స్​ పట్ల ఉన్న ఓ అపోహకు తాజా సర్వే చెక్​పెట్టింది. వీడియోగేమ్స్​ ఆడే పిల్లల్లో సాధారణ పిల్లలకంటే ఐక్యూ లెవల్స్​ కూడా ఎక్కువగానే ఉన్నాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. వీడియో గేమ్స్​ పిల్లలకు మానసిక ప్రశాంతతను ఇస్తాయని.. వారిలో సంభాషణ నైపుణ్యాన్ని పెంచుతాయని.. పెద్దలతో వ్యవహరించే తీరులోనూ ఎంతో మార్పు వస్తుందని ఈ సర్వే తేల్చిచెప్పింది. ఈ సర్వే చేసింది ఆషామాషి సంస్థ ఏమీ కాదండి.. బ్రిటన్​కు చెందిన నేషనల్​ లిటరసీ ట్రస్ట్​. ఈ సంస్థ వీడియోగేమ్స్​ గురించి నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

నేషనల్ లిటరసీ ట్రస్ట్ యూకేలో 11 నుంచి 16 ఏండ్ల మధ్య వయస్సున్న సుమారు 4,626 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలు అన్నీ నవంబర్ మరియు డిసెంబర్ 2019 మధ్య కాలంలో జరిగాయి. తాజాగా సర్వే ఫలితాలను విడుదల చేసింది సంస్థ. వీడియో గేమ్స్ ఆడే పిల్లలలో 35.3% మంది రీడర్లుగా మారుతున్నారు. వీడియో గేమ్స్​ ఆడేవారిలో 79.4 శాతం మంది విద్యార్థులు గేమింగ్​కు సంబంధించిన ఇన్​స్ట్రక్షన్స్​ చదివారట. రివ్యూస్​ చదవడం వల్ల వారికి కమ్యూనికేషన్​ పెరిగినట్టు సర్వే తేల్చింది. మరోవైపు వీడియో గేమ్స్​ ఆడే పిల్లలో 62.5 శాతం మంది తమ అనుభవాలను సొంత బ్లాగుల్లో రాసుకున్నట్టు సర్వేలో తేలింది. దీంతో వారిలో రైటింగ్​ స్కిల్స్​ కూడా పెరిగాయట. మరో 76 శాతం మంది పిల్లలు తమ వీడియోగేమింగ్​ అనుభవాల గురించి తోటి స్నేహితులతో షేర్​ చేసుకున్నారట దీంతో వారిలో సంభాషణ నైపుణ్యం కూడా పెరిగిందని తేల్చింది సర్వే. అందులో 29. 4 శాతం మంది విద్యార్థుల్లో పుస్తకపఠనం ఉన్నదని సర్వే తేల్చింది. వీడియో గేమ్స్​తో ఒత్తిడిని జయించవచ్చని.. తెలివితేటలు కూడా పేరుగుతాయని సర్వేలో వెల్లడైంది.

కొసమెరుపు

24 గంటలు వీడియో గేమ్స్​ ఆడే విద్యార్థుల్లో దృష్టిలోపం, ఇతర రుగ్మతలతో పాటు ఒబేసిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అతి ఎప్పుడైనా అనర్థదాయకమే కాబట్టి నిరంతరం వీడియో గేమ్స్​ ఆడటం వల్ల ఇబ్బందులు తప్పవు. ఇందుకు సంబంధించీ ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. అప్పుడప్పుడూ వీడియో గేమ్స్​ ఆడితే ఇబ్బంది లేదు కానీ తరుచూ ఆడుతుంటే మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు.