Begin typing your search above and press return to search.
ఎన్ ఆర్ ఐ అవినాష్ తల్లిదండ్రుల ఆవేదన.. రాని మృతదేహం
By: Tupaki Desk | 5 Jun 2019 10:34 AM GMTవిశాఖకు చెందిన అవినాష్ అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం అమెరికాలోని ఓ సరస్సులో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే.. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన అవినాష్ ప్రమాదవశాత్తు సరస్సులో పడి మరణించాడు.
నాలుగురోజులైనా కొడుకు మృతదేహం ఇంటికి రాకపోవడం.. ఇతర లాంచనాలు అమెరికాలో పెండింగ్ లో ఉండడంతో విషయం తెలిసి మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అవినాష్ మృతదేహం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.
నాలుగు రోజులైనా అమెరికాలో అవినాష్ డెడ్ బాడీ తరలింపు విషయంలో అమెరికా ముందడుగు పడలేదట.... అమెరికా అధికారులు పట్టించుకోకపోవడంతో తరలించడం కష్టంగా మారింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అవినాష్ తండ్రి వెంకట్రావ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తాడు. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో, అమెరికా అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కలెక్టర్ ను కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు , బంధువులు కలిసి అవినాష్ మృతదేహం తీసుకురావాలని కోరారు. కొడుకు మృతి, మృతదేహం రాకపోవడంతో అవినాష్ తల్లిదండ్రుల రోదన కలిచివేస్తున్నాయి.