Begin typing your search above and press return to search.

ఈ పార్సిల్ జీవితకాలం లేటు...

By:  Tupaki Desk   |   18 Sep 2015 4:05 PM GMT
ఈ పార్సిల్ జీవితకాలం లేటు...
X
పార్సిల్‌ ను సాధార‌ణంగా ఎపుడు పంపిస్తారు? అర్జెంటుగా చేరాల్సి ఉంటేనో...లేదా మ‌న‌కు వెళ్ల‌డం వీలుప‌డ‌ని సంద‌ర్భంలోనూ. అయితే ఎంత ఆల‌స్యం అయినా మ‌రీ నెల‌లు, ఏళ్లు అయితే ఆల‌స్యం కాదు క‌దా. కానీ ఓ పార్సిల్ ఏకంగా 40 ఏళ్ల త‌ర్వాత అడ్ర‌సుకు చేరింది. చిత్రంగా ఆ పార్సిల్ తీసుకున్న‌వారికి కూడా..ఆ వివ‌రాలు గుర్తులేవు. య‌థావిధిగా ఇది ప్ర‌భుత్వానికి చెందిన పార్సిల్ స‌ర్వీస్ కావ‌డం ఆస‌క్తిక‌రం.

అస్ర్టేలియాకు చెందిన ఇరేన్ గారెట్ టెన్నిస్ క్ల‌బ్‌ లో స‌భ్యురాలు. 1975లో ఆమె కొద్దికాలం ఆ క్ల‌బ్‌ లో స‌భ్య‌త్వం తీసుకొని ఆ త‌ర్వాత ఆట ఆడేటం మానేశారు. అయితే ఆమెకు 40 ఏళ్ల త‌ర్వాత తాజాగా ఓ పార్సిల్ వ‌చ్చింది. చూస్తే చివికిపోయి...ఎప్పుడో జ‌మానాలో చేసిన బండిల్‌ లో ఆమెకు ఆ పార్సిల్ వ‌చ్చింది. విప్పి చూస్తే ప్ర‌భుత్వానికి చెందిన మెయిల్ స‌ర్వీస్ నుంచి ఆ పార్సిల్ వ‌చ్చినట్లు వివ‌రాలు ఉన్నాయి. ఏళ్ల క్రితం బుక్ చేసిన పార్సిల్‌ అనేందుకు ఆధారంగా....దారాల‌తో కుట్టి ఉంది.

ఈ పార్సిల్ ను చూసిన త‌ర్వాత గారెట్ ఆశ్చ‌ర్య‌పోయింది. త‌నక‌స‌లు అప్ప‌ట్లో జ‌రిగిన విష‌యాలేమీ గుర్తుకులేవ‌ని..అయితే అపుడు, ఇపుడు త‌ను ఉన్న చిరునామా ఒక్క‌టే కావ‌డం వ‌ల్ల ఆ పార్సిల్ వ‌చ్చిన‌ట్లుంద‌ని పేర్కొంది. త‌న పేరిట గ‌తంలో ఎవ‌రో పార్సిల్ బుక్ చేసి ఉంటార‌ని ఇన్నాళ్ల త‌ర్వాత అది త‌న‌కు చేరింద‌ని ఉబ్బిత‌బ్బిబ్బు అయిపోయింది.

పార్సిల్స్ బుక్ చేసిన స‌మ‌యంలో పొర‌పాటున గారెట్‌ కు రావాల్సిన పార్సిల్ ఎక్క‌డో ప‌డిపోయి ఉంటుంద‌ని...స‌రంజామా వెతుకుతుంటే అదిప్పుడు పైకి వ‌చ్చి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే తిరిగి ఆ పార్సిల్‌ ను గారెట్‌ కు అంద‌జేశార‌ని చెప్తున్నారు. మొత్తంగా 40 ఏళ్ల త‌ర్వాత పార్సిల్ రావ‌డ‌మే ఆశ్చ‌ర్యం అంటే....అది కూడా చెత్త‌బుట్ట‌లో ప‌డేయ‌కుండా స‌రైన చిరునామాకు అందించ‌డం అభినంద‌నీయ‌మే.