Begin typing your search above and press return to search.

సూళ్లూరుపేట‌లో నువ్వా నేనా.. టీడీపీ టికెట్ కోసం పోటా పోటీ...!

By:  Tupaki Desk   |   8 July 2023 9:48 AM GMT
సూళ్లూరుపేట‌లో నువ్వా నేనా.. టీడీపీ టికెట్ కోసం పోటా పోటీ...!
X
ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం సూళ్లూరుపేట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఖ‌చ్చితం గా గెలుస్తుంద‌నే అంచ‌నాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య పోరు కూడా ఎక్కువ‌గా నే ఉంది.దీంతో ఈ టికెట్‌ను ఎవ‌రికి క‌ట్ట‌బెట్టాల‌నేది పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌రీక్ష‌గా మారింది. దీంతో ఆయ‌న ఎటూ తేల్చ‌కుండానే.. ఈ నియోజ‌క‌వ‌ర్గం స‌మీక్ష‌ను ముగించారు.

ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు కీల‌క నాయ‌కులు టికెట్‌కోసం పోటీ ప‌డుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు ప‌ర‌సా వెంక‌ట‌ర‌త్నం, ప్ర‌స్తుత టీడీపీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే నెల‌వ‌ల సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ధ్య టికెట్ పోరు తీవ్రంగా ఉంది.

వీరితోపాటుగా..తిరుప‌తి పార్ల‌మెంటు నియోక‌వ‌ర్గం ఎస్సీ సెల్ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న శ్రీప‌తిబాబు కూడా టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో ఒక‌రిని ఎంపిక చేయ‌క త‌ప్ప‌ద‌ని టీడీపీ అధినేత నిర్ణ‌యించారు.

వీరిలో వ‌రుస‌గా రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప‌రసార‌త్నంపై పార్టీ అధిష్టానానికి సానుకూలత లేద‌ని తెలుస్తోంది. 2009లో ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కు అవ‌కాశం ఇచ్చారు.

కానీ, ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, నెల‌వ‌ల సుబ్ర‌హ్మ‌ణ్యం కాంగ్రెస్ హ‌యాంలో విజ‌యం ద‌క్కించారు. త‌ర్వాత‌.. పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న కు టికెట్ ద‌క్క‌లేదు.

ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య గ్రాఫ్ దారుణంగా ఉంద‌ని.. టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని పార్టీకి నివేదిక‌లు అందుతున్నాయి. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన నాయ‌కుడికే ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వాల‌ని.. అందునా యువ నాయ‌కుడికి ఇవ్వాల‌ని పార్టీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈక్ర‌మంలో శ్రీప‌తి బాబు పేరు తెర‌మీదికి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

అయితే.. ఇప్పటికిప్పుడు ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా.. కొన్నాళ్ల త‌ర్వాత‌.. స‌ర్దుబాటు చేయాల‌ని భావిస్తోంద‌ట‌. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ పోరు అలానే కొన‌సాగ‌నుంద‌ని అంటున్నారు.