Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ పై పరాగ్ అగర్వాల్ దావా
By: Tupaki Desk | 11 April 2023 9:54 PM GMTట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్ చేత తొలగించబడిన ఐదు నెలల తర్వాత, ట్విటర్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ముగ్గురు కోర్టుకు ఎక్కారు. తామ ఉద్యోగులకు ఉన్నప్పుడు వివిధ వ్యాజ్యాలు, పరిశోధనలు , కాంగ్రెస్ విచారణల కోసం తమకు అయిన ఖర్చులను తిరిగి చెల్లించాలని కోరుతూ సోమవారం దావా వేశారు.
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, కంపెనీ మాజీ చీఫ్ లీగల్ , ఫైనాన్షియల్ ఆఫీసర్ లు ముగ్గురూ కలిసి తమకు పలు చట్టపరమైన విచారణలు, న్యాయ ప్రక్రియల్లో పాల్గొన్నామని.. ఇందుకోసం $1 మిలియన్ కంటే ఎక్కువ బకాయిలు తమకు చెల్లించాల్సి ఉన్నాయని.. వాటిని ట్విట్టర్ సంస్థ చట్టబద్ధంగా చెల్లించాలని దావాలో పేర్కొన్నారు.
ముగ్గురు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు ట్విట్టర్ తమకు రీయింబర్స్ చేయడానికి ఒప్పందాలకు కట్టుబడి ఉందని వాదించారు. అయితే ఏ విషయంలో విచారణకు హాజరయ్యారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
మాజీ ట్విట్టర్ సీఈవో అగర్వాల్ ,అప్పటి-చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ గత సంవత్సరం కోర్టుకి సాక్ష్యాలను అందించారు. కోర్టు పత్రాల ప్రకారం "ఫెడరల్ అధికారుల విచారణలో పాల్గొన్నామని తెలిపారు.
ఎలోన్ మస్క్ ట్విటర్ షేర్లను పోగుచేసుకున్నప్పుడు సెక్యూరిటీ నిబంధనలను పాటించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేచేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని $44 బిలియన్లకు టేకోవర్ చేసిన తర్వాత అక్టోబర్ చివరిలో అగర్వాల్, గద్దె , సెగల్‌లను వారి పోస్ట్‌ల నుండి తొలగించారు.
ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మస్క్ ఉద్యోగుల ర్యాంక్‌లను తగ్గించాడు. కోతలతో ఉద్యోగుల జీతాలను కుదించాడు. తప్పుడు సమాచారం , ఇతర దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం గురించి నిబంధనలు మార్చి ట్విట్టర్ విశ్వసనీయతను దెబ్బతీశాడన్న ఆరోపణలు తెచ్చుకున్నాడు.
ఎలోన్ మస్క్ సంస్థ వృథా ఖర్చులను తగ్గించుకుంటాను అని తెలిపాడు. గత ఐదు నెలల్లో మస్క్ ఇప్పటికే 70% మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించినప్పటికీ నిరంతర ఖర్చు తగ్గింపు ఇప్పటికీ కొనసాగుతోంది.
మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి ట్విటర్ కొత్త సీఈవోగా తగిన వ్యక్తిని వెతకాలని యోచిస్తున్నట్లు ఎలోన్ మస్క్ తెలిపారు. ఫిబ్రవరిలో మస్క్ ట్విట్టర్ యొక్క కొత్త సీఈవోగా కుక్క ఫోటోను ట్వీట్ చేసాడు. అతనికి ఇష్టమైన క్రిప్టో డాగ్‌కాయిన్ నే ట్విట్టర్ కు పెట్టాడు. దీంతో క్రిప్టో డాగ్ కాయిన్ ధర పెరిగింది. ఇలా అనైతిక చర్యలకు పాల్పడుతూ ఎలన్ మస్క్ చేస్తున్న వ్యవహారాలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి.