Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడులో ఇవాలేం జ‌రిగిందంటే...

By:  Tupaki Desk   |   17 Feb 2017 1:27 PM GMT
త‌మిళ‌నాడులో ఇవాలేం జ‌రిగిందంటే...
X

- త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇవాళ మ‌రిన్ని అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి శశికళను తప్పించినట్లు పన్నీర్‌ సెల్వం ప్రకటించారు.తమదే అసలైన అన్నాడీఎంకే అని పన్నీర్‌ సెల్వం వాదిస్తున్నారు. దినకరన్‌ - వెంకటేశ్‌ లను శశికళ ఇటీవలే పార్టీలో చేర్చుకుని, దినకరన్‌ ను అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శిగా నియమించింది. కాగా, తమదే అసలైన అన్నాడీఎంకే అని సెల్వం వాదిస్తున్నారు.

-పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ…శాంతియుతంగా ఆందోళన చేసే అమ్మ మద్దతు దారులను అరెస్టు చేయవద్దంటూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన తమిళనాడు పోలీసులకు ఒక లేఖ రాశారు.

-డీఎంకే కోశాధికారి - ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు తమిళనాడు సీఎం పళని స్వామికి ఒక సలహా ఇచ్చారు. అసెంబ్లీలో తనను చూసి కనీసం పలకరింపుగా కూడా నవ్వవద్దన్నదే ఆ సలహా. ఇంతకీ ఆ సలహా ఎందుకు ఇచ్చారంటే గతంలో సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం స్టాలిన్ ను చూసి పలకరింపుగా నవ్వడంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. పన్నీర్ సెల్వంను తప్పించడానికి శశికళ చూపిన ప్రధాన కారణాలలో అదొకటి కావడం గమనార్హం. ఇప్పుడు స్టాలిన్ ఆ కారణాన్ని చూపే పళనిస్వామికి ఈ సలహా ఇచ్చారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని స్టాలిన్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా స్టాలిన్‌ అభివర్ణించారు.

- అసెంబ్లీలో త‌మ ఫ్లోర్ లీడ‌ర్‌ గా విద్యాశాఖ మంత్రి సెంగొట్టియాన్‌ ను అన్నా డీఎంకే ఎంపిక చేసింది. ప‌న్నీరుసెల్వం వ‌ర్గంలో ఉన్న పాండియ‌రాజ‌న్ స్థానంలో తొలిసారి మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన సెంగొట్టియాన్‌.. ఇప్పుడు అసెంబ్లీలో ఫ్లోర్ లీడ‌ర్ పాత్ర‌ను కూడా పోషించ‌నున్నారు. గ‌తంలో జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో ప‌న్నీరుసెల్వం అన్నా డీఎంకే ఫ్లోర్ లీడ‌ర్‌ గా ఉండేవారు.

- తమళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ పి. ధనపాల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు రేపు జరిగే విశ్వాస పరీక్షలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరపాలని కోరారు

-తమిళనాడు సీఎం పళనిస్వామి - మంత్రివర్గ సహచరులను సస్పెన్షన్‌ కు గురయ్యారు. పార్టీ పదవుల నుంచి తప్పిస్తున్నట్లు అన్నాడీఎంకే సీనియర్‌ నేత మధుసూదనన్‌ ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/