Begin typing your search above and press return to search.

తమిళ సీఎం పీఠంపై పన్నీర్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   20 March 2021 11:00 PM IST
తమిళ సీఎం పీఠంపై పన్నీర్ సంచలన ప్రకటన
X
కలైంజర్ (స్టాలిన్) ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నోరు జారిన సంఘటన కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొన్నేరిలో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

‘ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే వ్యవస్థాపకుడు కలైంజర్ (కరుణానిధి) విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో రెండు దశాబ్దాలు గడిచినా కలైంజర్ సీఎం కాలేరు అంటూ పన్నీర్ సెల్వం హాట్ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేసారు. తప్పు దొర్లినట్టు గుర్తించిన పన్నీర్‌సెల్వం, స్టాలిన్‌ ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేరని పేర్కొన్నారు.

కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కలైంజర్‌ అన్న బిరుదు ఉన్న విషయం విధితమే. ఆయన వారసుడిగా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌, సీఎం కావాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు.ఈసారి సర్వేలన్నీ డీఎంకే అధికారంలోకి వస్తాయని చెబుతున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం కౌంటర్ ఇవ్వబోయి ఇలా బుక్ అయిపోయాడు.

డీఎంకే పార్టీ అభ్యర్థులు ఈసారి 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. డీఎంకే మిత్రపక్షాలు సైతం, డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తుండటం గమనార్హం.