Begin typing your search above and press return to search.
ఆఫ్ఘన్ : తాలిబన్ల చేతుల్లోకి పంజ్‌షేర్ .. అసలు నిజమేంటి
By: Tupaki Desk | 4 Sep 2021 6:36 AM GMTఅఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు. అయితే నార్తర్న్ అలయెన్స్ సైన్యం తాలిబన్లను తమ సరిహద్దుల్లోకి రాకముందే మట్టుబెడుతుంది. అఫ్ఘాన్ లో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీని మాత్రం స్వాధీనం చేసుకోలేక పోతున్నారు. అయితే , తాలిబన్లు మాత్రం పంజ్ షీర్ ను జయించామని... ప్రస్తుతం ఆ ప్రావిన్స్ తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు.
మరోవైపు ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఆ ప్రకటనను ఖండించారు. తాలిబన్లతో పంజ్ షీర్ తిరుగుబాటు దళం ఇంకా యుద్ధం చేస్తోందని, పంజ్ షీర్ తాలిబన్ ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. అల్లా దయతో ఆఫ్గనిస్తాన్ మొత్తాన్ని మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం.పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారులను ఓడించాం. ప్రస్తుతం ఆ ప్రావిన్స్ మా కమాండ్‌లోనే ఉంది అని తాలిబన్ కమాండర్ ఒకరు వెల్లడించారు. ఈ ప్రకటనను ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఖండించారు.సందేహం అక్కర్లేదు... మేమిప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.తాలిబన్ల దండయాత్ర కొనసాగుతోంది.అయితే మేము ఈ నేలను పట్టుకుని పోరాడుతున్నాం అని వెల్లడించారు.
అమృల్లా సలేహ్ తనయుడు ఎబదుల్లా సలేహ్ కూడా తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు పంజ్‌షీర్‌ను జయింలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆఫ్గనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ అలీ నజరీ సైతం తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.తాలిబన్లు పంజ్ షీర్ లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారని... ఇలాంటి తరుణంలో అందరి దృష్టిని మరల్చేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
పంజ్ షీర్ నాయకుడు మసౌద్,ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఇద్దరూ దేశం విడిచి పారిపోయినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. అమృల్లా సలేహ్ ఆ వార్తలను ఖండించారు. తాము ఎక్కడికీ పారిపోలేదని, ఇప్పటికీ పంజ్ షీర్ గడ్డ పైనే ఉన్నామని చెప్పారు. పంజ్ షీర్ ప్రస్తుతం మసౌద్ నాయకత్వంలో తాలిబన్లతో పోరాడుతోంది. సుశిక్షితులైన 10వేల మంది పంజ్‌షీర్ యోధులు తాలిబన్లతో తలబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వందలాది మంది తాలిబన్లను పంజ్ షీర్ దళం హతం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పంజ్ షీర్ లో తాలిబన్లకు అల్ ఖైదా కూడా తోడైందని నజరీ అలీ తెలిపారు.
తాలిబన్ ప్రభుత్వం అతి త్వరలో కొలువుదీరే అవకాశం ఉంది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది.బరాదర్,దివంగత తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహమ్మద్ యాకూబ్,షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జయ్‌లు ప్రభుత్వంలో టాప్ 3 స్థానాల్లో ఉండనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే వీరు ఖతర్ నుంచి కాబూల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ ప్రభుత్వంతో మతపరమైన అంశాలను హైబతుల్లా అఖుద్‌జాదా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. మొత్తం 25 మంత్రిత్వ శాఖలతో ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు చెబుతున్నారు.