Begin typing your search above and press return to search.

పానీపూరీలో ఏం కలిపాడో తెలిస్తే షాకవుతారు..

By:  Tupaki Desk   |   7 Feb 2017 10:44 AM GMT
పానీపూరీలో ఏం కలిపాడో తెలిస్తే షాకవుతారు..
X
పానీపూరీ కనిపిస్తే లొట్టలేసుకుని తింటాం.. చిన్నచిన్న పూరీల్లో పుల్లపుల్లని నీటిని వేసుకుని తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే... గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యాపారి మాత్రం పూరీలను ముంచి ఇచ్చే పానీలో ఏకంగా టాయిలెట్ క్లీనర్ కలిపేశాడట. ఎలా గుర్తించారో కానీ కొందరు ఈ సంగతి తెలుసుకుని ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టును అధికారులు బయట పెట్టారు. అయితే ఇదంతా ఇప్పటిది కాదు.. ఏడేళ్ల కిందటి సంగతి. కానీ.. ఇప్పుడా వ్యాపారికి ఆర్నెల్ల జైలు శిక్ష పడడంతో మరోసారి చర్చకొచ్చింది.

చేతన్ నాంజీ మార్వాడీ అనే ఆ వ్యాపారి పానీపూరి నీటిలో ఏదో కలుపుతున్నాడంటూ అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. వారొచ్చి ఆ శాంపిళ్లను కలెక్ట్ చేసుకున్నారు. వాటిని ప్రయోగశాలలో పరీక్షించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. అందులో ప్రమాదకరమైన ఆక్సాలిక్ యాసిడ్ ఉన్నట్లు తేలింది. ఈ యాసిడ్ ను సాధారణంగా టాయిలెట్ క్లీనర్లలో వాడుతారు. దీంతో చేతన్ ఏం కలుపుతున్నాడో అందరికీ అర్థమైపోయింది.

అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు చేతన్ పై కేసు పెట్టారు. సుదీర్ఘ కాలం విచారణ జరిగిన తరువాత న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. తినే ఆహారాన్ని కల్తీ చేస్తున్నందుకు గాను అతనికి ఆర్నెళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/