Begin typing your search above and press return to search.

తెలంగాణకు పాజిటివ్ షాక్.. ఒక్కరోజులో కేసులు అంతగా పెరగటమా?

By:  Tupaki Desk   |   3 Nov 2020 6:50 AM GMT
తెలంగాణకు పాజిటివ్ షాక్.. ఒక్కరోజులో కేసులు అంతగా పెరగటమా?
X
రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. భారత్ విషయానికి వస్తే తన ప్రభావాన్ని చూపించినా.. ఇటీవల కాలంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్లే.. గణాంకాలు సైతం ఊపిరి పీల్చుకునేలా ఉంటున్నాయి. ఒకదశలో రోజుకు ఐదారు వేలకు పైనే కేసులు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో నమోదైన పరిస్థితి నుంచి రోజుకు రెండు.. మూడు వందల కంటే దాటని పరిస్థితి నెలకొంది. వైరస్ తీవ్రత తగ్గటమే కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీంతో.. హైదరాబాద్ మహానగరంలో సాధారణ పరిస్థితులుచోటు చేసుకుంటున్నాయి. సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కరోజులో వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదు కావటం చాలామందికి రిలీఫ్ గా మారింది. అమెరికా.. యూరప్ లలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటం.. అందుకు భిన్నంగా తెలంగాణలో కేసులు తక్కువగా నమోదు కావటం మంచి పరిణామంగా పలువురు అభిప్రాయపడ్డారు.

అయితే.. ఈ తరహా సంతోషం ఏ మాత్రం మంచిది కాదని.. అప్రమత్తత చాలా అవసరమన్న విషయం ఈ రోజు విడుదల చేసిన రిపోర్టు స్పష్టం చేస్తోంది. సోమవారం ఒక్కరోజులో 1536 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా తేల్చారు. ఒక్కరోజులో దాదాపు 500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 2.42లక్షల మంది పాజిటివ్ అయినట్లుగా చెప్పాలి.

ఇంతకూ ఒక్కరోజులో 500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావటం వెనుక ఏం జరిగింది? ఇంతలా కేసులు ఎందుకు పెరిగినట్లు? అన్నది చూస్తే.. సోమవారం విడుదల చేసిన గణాంకాలు.. ఆదివారం నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించినవన్నది మర్చిపోకూడదు. విడి రోజులతో పోలిస్తే. . వీకెండ్స్ లో నిర్దారణ పరీక్షలు తక్కువగా జరగటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. వీకెండ్ వేళలో తక్కువగా పరీక్షలు నిర్వహించటం మొదట్నించి ఉన్నదే. ఈ కారణంతోనే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే.. సోమవారం పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించటంతో పాజిటివ్ కేసుల లెక్క ఒక్కసారిగా పెరిగినట్లుగాచెబుతున్నారు. ఒకవేళ.. కేసుల సంఖ్య పెరుగుతుందన్న సంకేతం ఏదైనా ఉందంటే.. రానున్న ఐదారు రోజుల్లో పాజిటివ్ కేసులు ఇప్పటికంటే ఎక్కువగా నమోదైన పక్షంలో సెకండ్ వేవ్ డేంజర్ షురూ అయినట్లుగా చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఎంతో అవసరమైతే తప్పంచి ఇంట్లో ఉండటానికి మించిన ఉత్తమమైన పని మరొకటి ఉండదంటున్నారు. అర్థమవుతుందా?