Begin typing your search above and press return to search.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెడీ.. ఫైనల్ స్టేజ్

By:  Tupaki Desk   |   29 Jun 2020 9:10 AM GMT
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెడీ.. ఫైనల్ స్టేజ్
X
మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరి కట్టడానికి ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం తయారు చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ కు చేరుకుంది. ఫలితాలు ఇప్పటి వరకు సానుకూలంగా ఉండటంతో, అక్టోబర్ నాటికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జెన్నర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్ చింపాంజీలపై పరీక్షించబడింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తాజాగా తెలిపారు. స్పానిష్ సొసైటీ ఆఫ్ రుమటాలజీతో వెబ్‌ఇనార్‌లో ఆయన ప్రసంగించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ చివరి నాటికి ఫలితాలను ప్రకటించి, అక్టోబర్ నాటికి ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రొఫెసర్ హిల్ తెలిపారు.

బ్రిటిష్ డ్రగ్స్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా సహాయంతో క్లినికల్ ట్రయల్స్ బ్రెజిల్ లోని వలంటీర్లపై జరుగుతున్నాయి. మహమ్మారివైరస్ వ్యాక్సిన్ టెస్టులు చివరి దశలో ఉన్నాయని ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్ మొట్టమొదటిది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీదే కానుంది.

ప్రస్తుతం ఈ టీకా ఎంత ప్రభావవంతంగా ఉందో యూనివర్సిటీ పరిశోధక బృందం పరీక్షిస్తోంది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దక్షిణాఫ్రికాకు చెందిన 2 వేల మంది వలంటీర్లు బ్రిటన్‌లో పాల్గొన్నారు. వారిపై వ్యాక్సిన్ పరీక్షించారు. మరో 4,000 మంది వలంటీర్లు తమపై చేయాల్సిందిగా నమోదు చేసుకున్నారు.

బ్రిటన్లో ఆక్స్ ఫర్డ్ కోవిడ్ -19 టీకాను ప్రముఖ వ్యాపారవేత్త అలోక్ వర్మ తీసుకోవడం గమనార్హం. ఫలితాలన్నీ సానుకూలంగా రావడంతో ఆస్ట్రాజెనెకా 30 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.