Begin typing your search above and press return to search.

కరోనా: లక్షణాలు ఎలా ఉన్నా డేంజర్​ తప్పదు..!

By:  Tupaki Desk   |   7 Oct 2020 6:00 PM GMT
కరోనా: లక్షణాలు ఎలా ఉన్నా డేంజర్​ తప్పదు..!
X
ప్రస్తుతం కరోనాను చాలా మంది సాధారణ జ్వరంలా కొట్టిపడేస్తున్నారు. వస్తుంది.. పోతుంది.. అనే ధోరణి పెరిగిపోయింది. వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. లక్షణాలు తక్కువగా ఉన్నవాళ్లు వెంటనే కోలుకోవచ్చని.. వారికి ఇబ్బందులు తక్కువగా ఉంటాయని కొందరి నమ్మకం. అయితే కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నా వారికి వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని.. మూడునెలలపాటు కరోనా వ్యాధి ఏదో రూపంలో మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటి కీ వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు భావించాలని ఓ అధ్యయనం తేల్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు కూడా నెలల తరబడి అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారని ఫ్రాన్స్​కు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు.

కరోనా బాధితుల్లో మూడో వంతు మందికి స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ.. వారంతా 60 రోజుల తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల బాధితుల్లో ఆస్పత్రిలో చేరిన వారిలో దీర్ఘకాలిక కరోనా లక్షణాలు ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.

మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో స్వల్ప లక్షణాలు ఉన్న 150 మంది బాధితులపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల మంది కరోనా బారినపడగా.. వారిలో లక్షణాల తీవ్రత వారాల నుంచి నెలల వ్యవధి కొనసాగినట్టు ఆధారాలు ఉన్నాయని జర్నల్​ క్లినికల్​ మైక్రోబయాలజీ అండ్​ ఇన్ఫెక్షన్​ లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. కరోనా రోగులు చాలామంది ఉపిరితిత్తులు, గుండెనొప్పి వంటి రోగాలతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది.