Begin typing your search above and press return to search.

కరోనా తిరగదోడితే చుక్కలే.. రెండోసారీ వస్తున్న మహమ్మారి

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:30 PM GMT
కరోనా తిరగదోడితే చుక్కలే..  రెండోసారీ వస్తున్న మహమ్మారి
X
కరోనా ఓ సారి వచ్చిందంటే మళ్లీ రావడం చాలా అరుదు. 90 రోజుల వరకు ఆ వ్యాధి మనకు రాదని ఇప్పటివరకు వైద్యులు చెబుతున్నారు. కరోనా రెండోసారి కూడా సోకవచ్చని ఇప్పడు వైద్యలు చెబుతున్నారు. మొదటి సారి కంటే రెండో సారి కరోనా వస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటి సారి కరోనా సోకితే హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకోచ్చని.. కానీ రెండో సారి కరోనా వస్తే మాత్రం కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి ఆక్సీజన్​ పెట్టుకోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.
రెండో సారి కరోనా సోకితే ఆ వ్యక్తికి సరిపడా ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు అందజేయలేవని వైద్యులు అంటున్నారు. నెవడాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా రెండో సారి సోకింది. అతడికి మొదటి సారికంటే రెండోసారి వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా కనిపించిందని వైద్యులు చెబుతున్నారు.

మార్చి 25 సదరు యువకుడికి తొలిసారి కరోనా లక్షణాలు కనిపించాయి. గొంతు నొప్పి, దగ్గు, వికారం, తలనొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో 18 ఏప్రిల్ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని కన్ఫామ్ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు మందులు వాడాడు. కాగా 27న కరోనా లక్షణాలు అన్ని పోయాయి. మే 9, 26 తేదీల్లో అతడికి మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్​ అని తేలింది. కానీ మే 28న మళ్లీ కరోనా లక్షణాలు వచ్చాయి. జ్వరం, తలనొప్పి, శ్వాస అందకపోవడం, దగ్గు, వికారం, మైకం లాంటివి కనిపించాయి. 5 జూన్ – రెండోసారి పాజిటివ్ వచ్చింది. శ్వాస అందకపోవడం (లో బ్లడ్ ఆక్సిజన్) సమస్య వచ్చింది. అతడికి మొదటిసారికంటే రెండోసారి కరోనా తీవ్రంగా వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.

ఒకసారి కరోనా వచ్చి తగ్గినవారు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యలు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. హాంకాంగ్, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో రెండోసారి నమోదైన కేసులు మొదటి దాని కంటే ప్రమాదకరంగా లేవని తేల్చారు. ఈక్వెడార్ లో మాత్రం ఒక వ్యక్తికి రీ ఇన్ఫెక్షన్ వచ్చి మొదటి సారి కంటే తీవ్రంగా ఇబ్బందిపడ్డాడని, కాకపోతే హాస్పిటల్ ట్రీట్‌మెంట్ అవసరం లేకుండానే నయం అయిందని రిపోర్టులు చెబుతున్నాయి.