Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: ఏపీలో కరోనా తగ్గుముఖం

By:  Tupaki Desk   |   13 Nov 2020 11:02 PM IST
గుడ్ న్యూస్: ఏపీలో కరోనా తగ్గుముఖం
X
ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.. వారం పది రోజులుగా 5వేల కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య తగ్గించినప్పటికీ వైరస్ కేసులు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 1593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9021 టెస్టులు చేశారు.. దీంతో ఏపీలో కరోనా కేసులు 8,51,298కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 10మంది మరణించారు.దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6847 కు పెరిగింది.

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 105 మంది, చిత్తూరులో 225, తూర్పు గోదావరిలో 259, గుంటూరులో 202 కేసులు నమోదయ్యాయి.

ఇక ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 2178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 824189కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 20262 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,050కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 805మంది కరోనాతో మరణించారు.