Begin typing your search above and press return to search.

లాక్ డౌన్లో స‌గం దేశం..!

By:  Tupaki Desk   |   9 May 2021 1:30 AM GMT
లాక్ డౌన్లో స‌గం దేశం..!
X
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ దారుణ మార‌ణ‌కాండను సృష్టిస్తుండ‌డంతో.. ప్ర‌జ‌లు భ‌యం గుప్ప‌టి బ‌తుకీడుస్తున్నారు. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని కాలం వెళ్ల‌దీస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌భుత్వాలు కూడా భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దీంతో.. ఒక్కొక్క‌టిగా రాష్ట్రాల‌న్నీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి.

దేశంలో ఈ రోజు వ‌ర‌కు 14 రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ అమ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. మొట్ట మొద‌టిసారిగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ అమ‌లు చేసింది. ఆ త‌ర్వాత ఒక్కొక్క‌టిగా లాక్ డౌన్ వైపు అడుగులు వేశాయి.

దీంతో.. స‌గం దేశం లాక్ డౌన్ లో ఉండిపోయింది. దేశంలో రోజుకు 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. ఇంకా ప‌లు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ లాక్ డౌన్ అమ‌లు చేస్తున్న రాష్ట్రాల‌ను చూస్తే..

కేర‌ళః మే 16వ తేదీ వ‌ర‌కు పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్ర‌క‌టించింది.
ఢిల్లీః మే 10వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగించింది.
మ‌ధ్య‌ప్ర‌దేశ్ః మే 15 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంది.
ఉత్త‌ర ప్ర‌దేశ్ః మే 10 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంది.
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ః మే 16 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించింది.
త‌మిళ‌నాడుః మే 24వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్‌
క‌ర్నాట‌కః మే 24వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌లు
రాజ‌స్థాన్ః మే 24 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌లు
మ‌హారాష్ట్రః మే 15 వ‌ర‌కు క‌ర్ఫ్యూతో కూడిన లాక్ డౌన్‌
బిహార్ః మే 15 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌లు
గోవాః మే 23 వ‌ర‌కు లాక్ డౌన్
హ‌రియాణః మే 10వ‌ర‌కు లాక్ డౌన్‌
మ‌ణిపూర్ః మే 7 వ‌ర‌కు లాక్ డౌన్‌
చండీగ‌ఢ్ః వారం రోజుల‌పాటు లాక్ డౌన్‌