Begin typing your search above and press return to search.

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ ..కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   11 Sept 2020 7:30 PM IST
ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ ..కొత్తగా ఎన్నంటే ?
X
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ప్రతిరోజూ కూడా భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో మరో 9999 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్ ‌లో వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 547686కి పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 77 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4779కి చేరింది. ఇక , ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 547686 కాగా, 446716 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 96191. ఇప్పటి వరకు కరోనా కారణంగా 4779 మంది చనిపోయారు. అలాగే, గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,137 కరోనా టెస్టులు చేశారు.

ఇక , గడిచిన 24 గంటల్లో ఏపీలోని కడప జిల్లాలో 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణా 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఇక ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1499 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ గోదావరి 1081, చిత్తూరు 1040, గుంటూరు 920, ప్రకాశం 901, నెల్లూరు 778, కడప 698, విజయనగరం 594, శ్రీకాకుళం 570, అనంతపురం 557, కర్నూలు 497, కృష్ణా 451, విశాఖపట్నం 413 కరోనా కేసులు నమోదయ్యాయి.