Begin typing your search above and press return to search.
ఏపీలో 88 వేలకు చేరిన కేసులు: కొత్తగా 7,813 పాజిటివ్.. 52 మంది మృతి
By: Tupaki Desk | 25 July 2020 5:01 PM GMTమహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో ఊహించని రీతిలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలో 7,813 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో వైరస్ బారిన పడిన వారు 52 మంది మృతి చెందినట్లు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హెల్త్ బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో 53,681 మందికి నమూనాలు పరీక్షించగా ఏకంగా 7,813 మందికి పాజిటివ్ అని తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 88,671కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 985కు చేరింది.
గుంటూరు జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.
తాజాగా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వారు 3,208 మంది. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జయిన వారి సంఖ్య 43,255 మంది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 44,431. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.