Begin typing your search above and press return to search.

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   20 Aug 2020 12:10 PM GMT
దేశంలో  రికార్డు స్థాయిలో కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే ?
X
భారత్‌ లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. ప్రతి రోజు 60వేలకు పైగా కొత్త కేసులతో పాటు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఇకపోతే , తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 977 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్దారణ టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 9 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో టెస్ట్‌లు చేయడం ఇదే తొలిసారి. నిన్నటి వరకు మొత్తం 3,26,61,252 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఇక , తెలంగాణలోకరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1195 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,424కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 729కు చేరింది.

ఇక , ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,742 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా లెక్కలతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. కరోనా తో పోరాడి 2,26,372 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 2,906 మంది మరణించారు. ప్రస్తుతం 86,725 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.