Begin typing your search above and press return to search.

జూలో అద్భుతం..పదేళ్ల తర్వాత పాండాల సెక్స్

By:  Tupaki Desk   |   9 April 2020 4:00 AM IST
జూలో అద్భుతం..పదేళ్ల తర్వాత పాండాల సెక్స్
X
హాంకాంగ్ జూలో అద్భుతం జరిగింది. రెండు ఆడ, మగ పాండాలు (చైనాకు చెందిన ఎలుగుబంట్లు) శారీరకంగా కలిశాయి. ఇలా కలవడం పదేళ్లకు చోటుచేసుకోవడంపై జూ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

చైనాకు చెందిన ఈ పాండాలకు ప్రైవసీ ఎక్కువ కావాలి. జూకు వచ్చే సందర్శకులతో ఇవి పదేళ్లుగా శారీరకంగా కలుసుకోలేదు. దీంతో అరుదైన వీటి సంతతి తగ్గిపోతోంది.

అయితే కరోనాతో లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయాయి. జనాలు జూలకు రావడం లేదు. దీంతో ప్రైవసీ దొరకడంతో పదేళ్ల తర్వాత హాంకాంగ్ లోని ఓషన్ పార్క్ లో యింగ్ యింగ్, లీలీ అనే ఎలుగుబంట్లు శారీరకంగా కలిశాయి.

సాధారణంగా మార్చి నుంచి మే వరకు ఆడ పాండాలకు కలయిక టైం. ఇప్పుడు కలిస్తే వాటికి పిల్లలు పుడుతాయి. అందుకే తాజా కలయికతో కొత్త పాండాలు పుట్టుకు రావడం ఖాయమని జూ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో లాక్ డౌన్ వల్ల పాండాలు కలయిక చెంది వాటి సంతతి అభివృద్ధి చెందుతోందని సంబరపడుతున్నారు.