Begin typing your search above and press return to search.
ఆ రెండూ అన్ రిజర్వ్‌డ్ పంచాయతీలు .. కానీ, బరిలో ఎస్సీ అభ్యర్థులు - ఎందుకంటే?
By: Tupaki Desk | 5 Feb 2021 8:03 AM GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హిట్ మాములుగా లేదు. ఇప్పటికే మొదటిదశ ఎన్నికల పోలింగ్ కి ఈసీ సర్వం సిద్ధం చేస్తుండటంతో అభ్యర్థులు కూడా తమ తమ వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మాములుగానే కొంచెం హిట్ ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఆ హిట్ మరింత వేడెక్కింది. ఇకపోతే ఎన్నికలు అంటే రిజర్వేషన్ తప్పనిసరి. అవి ఏ ఎన్నికలైనా కూడా రిజర్వేషన్ తప్పనిసరి. ఆయా రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు పోటీలో నిలుస్తారు. సాధారణంగా చాలా పోటీ ఉంటుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా పోటీ ఉంది.
కానీ ప్రకాశం జిల్లాలో కొంచెం విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి రిజర్వేషన్ లో భాగంగా అన్ రిజర్వ్‌డ్ కు కేటాయించారు. కానీ, ఆ గ్రామాల్లో ఓటర్లంతా ఎస్సీ సామాజికవర్గం వారే ఉన్నారు. దీంతో ఎస్సీలే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అద్దంకి మండలం విప్పర్లవారిపాలెంలో మొత్తం 489 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ పదవీ అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. కానీ, ఆ పంచాయతీ ఓటర్లందరూ ఎస్సీలే కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన మహిళలే బరిలో ఉంటూ వస్తున్నారు. ఇక పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలం లక్కవరం గ్రామంలోని 647 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా ఎస్సీలే కావడం విశేషం. ఇక్కడా సర్పంచ్ పదవీని అన్ రిజర్వ్‌డ్ కు కేటాయించారు. కానీ, ఎస్సీలే పోటీ చేస్తున్నారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నిక జరగనుంది. అయితే ఆ రెండు గ్రామాల జనాభా గురించి ఎన్నికల కమిషన్ అంచనా వేయలేదా అనే అనుమానం కలుగుతోంది. ఆ రెండు పంచాయతీల్లో ఎస్సీలే ఉంటే అన్ రిజర్వ్‌డ్ ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.