Begin typing your search above and press return to search.

జగన్ టార్గెట్: చేతులెత్తేస్తున్న మంత్రులు - ఎమ్మెల్యేలు!

By:  Tupaki Desk   |   3 Feb 2021 9:45 AM GMT
జగన్ టార్గెట్: చేతులెత్తేస్తున్న మంత్రులు - ఎమ్మెల్యేలు!
X
పంచాయతీ ఎన్నికలు అధికార వైసీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికలకు తావు లేకుండా ఏకగ్రీవాల కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలు.. మంత్రులకు ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన వీరు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఇబ్బడిముబ్బడిగా చేరిన నేతలతో గ్రూపు రాజకీయాలు గ్రామాల్లో పీక్స్ చేయారట.. ఆశావహులు ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఇప్పుడు వైసీపీ నేతల పరిస్తితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట..

ఇప్పుడు జగన్ చెప్పినట్టు ఏకగ్రీవాలు చేయడం మంత్రులు, ఎమ్మెల్యేలకు తలకు మించిన భారమవుతోందట.. వైసీపీలోని గ్రూపుల నేతలను, ప్రతిపక్ష పార్టీల నేతలను పోటీచేయకుండా నిలుపుదల చేయడం వారి చావుకొస్తోందట.. కష్టపడి ఇన్నాళ్లు పార్టీకోసం పనిచేసిన నేతలు ఇప్పుడు కాంప్రమైజ్ కావాలంటే అస్సలు ఒప్పుకోవడం లేదట.. ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు ఎమ్మెల్యే, మంత్రులకు ఇదే ‘పంచాయితీ’ నడుస్తోందట..

జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పొసగని వాతావరణంతో ఏకాభిప్రాయం కాక వారి గ్రూపులు ఏకగ్రీవం చేయడం లేదట.. చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సఖ్యత లేకపోవడంతో ఇక్కడ ఏకగ్రీవాల ‘పంచాయితీ’ తేలడం లేదట.. గ్రూపులుగా నేతలు విడిపోవడంతో పంచాయితీల్లో పోటీ అనివార్యమవుతోందట.. అందరూ పోటీచేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు షాకులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది.

వీరిందరినీ బుజ్జగించడం మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల కావడం లేదట.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందట.. దీంతో జగన్ పెట్టిన ఏకగ్రీవాల టార్గెట్ ను చేరుకోవడం కష్టమవుతోందని మంత్రులు ఎమ్మెల్యేలు వాపోతున్నారట..