Begin typing your search above and press return to search.

అసలు ఏకగ్రీవాలను జరగనిస్తాడా ?

By:  Tupaki Desk   |   31 Jan 2021 2:30 PM GMT
అసలు ఏకగ్రీవాలను జరగనిస్తాడా ?
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం చూస్తుంటే పంచాయితి ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగనిచ్చేట్లు లేరు. ఎందుకంటే ఎక్కడ ఏకగ్రీవాలు జరిగినా వాటిపై ఫిర్యాదు చేయటానికి తెలుగుదేశంపార్టీ నేతలు కావచ్చు మరోకళ్ళు కావచ్చు రెడీగా ఉంటారు. అసలు ఏకగ్రీవాలంటేనే నలుగురి మధ్య ఏదో పద్దతిలో ఒప్పందాలు జరిపించి ముగ్గురిని విత్ డ్రా చేయించి ఒకరికి మార్గం సుగమం చేయటం. మరలాంటపుడు అందరిముందు ఓకే అని చెప్పి తర్వాత వెళ్ళి ఫిర్యాదులు చేస్తే పరిస్దితి ఏమిటి ?

ఒకవైపేమో ఏకగ్రీవాలు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు భారీగా నగదు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఇదే సమయంలో ఏకగ్రీవాలు జరగటాన్ని నిమ్మగడ్డ నిరుత్సాహపరుస్తున్నారు. అలాగే చంద్రబాబునాయుడు కూడా ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు జరిపించాల్సిందే అని తమ్ముళ్ళకు ఆదేశాలిస్తున్నారు. మరి ఈ నేపధ్యంలో ఏకగ్రీవాలైన వాటిపై నిమ్మగడ్డ విచారణ జరిపించటం ఖాయంగా అనుమానిస్తున్నారు వైసీపీ నేతలు.

ఏకగ్రీవాలైన పంచాయితీలను తనకున్న అధికారాలతో నిమ్మగడ్డ రద్దు చేస్తారా ? అనే అనుమానాలు పెరిగిపోతోంది అధికారపార్టీ నేతల్లో. ఒకవేళ అదే జరిగితే అప్పుడేమవుతుంది ? అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది. నిమ్మగడ్డ దూకుడు చూస్తుంటే ఏకగ్రీవాలను అంగీకరించేది లేదన్నట్లుగా ఉంది. ఒకవేళ ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదని చెబుతునే బలవంతపు ఏకగ్రీవాలకు మాత్రమే తాను వ్యతిరేకమంటున్నారు.

ఏకగ్రీవాల్లో స్వచ్చంద ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలనేవి ఉండవు. ఎన్నికల్లో ఎప్పుడు, ఎక్కడ ఏకగ్రీవమైనా ఏదో పద్దతిలో పోటీచేసే వాళ్ళ మధ్య రాజీచేసి ఒకరికి అనుకూలంగా మిగిలిన అందరినీ పోటీ నుండి విరమింపచేయటమే ఏకగ్రీవం లక్ష్యమని నిమ్మగడ్డకు తెలీకుండానే ఉంటుందా. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నపుడు ఏకగ్రీవాలు ఎలా జరిగాయో అందరికీ గుర్తుంది. చూద్దాం నామినేషన్ల గడువు అయిపోయిన తర్వాత నిమ్మగడ్డ ఏమిచేస్తారో.