Begin typing your search above and press return to search.

నామినేషన్లు తీసుకోవడం లేదు.. ఇంతకీ ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?

By:  Tupaki Desk   |   25 Jan 2021 8:20 AM GMT
నామినేషన్లు తీసుకోవడం లేదు.. ఇంతకీ ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
X
ఏపీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఓ వైపు ఉద్యోగసంఘాలు, ప్రభుత్వం వద్దంటున్నా ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. (ఎన్నికల నిర్వహణపై ఈసీకి సర్వాధికారాలు ఉంటాయి) ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ రావడంతో ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచే మొదటిదశలో నామినేషనల్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయినప్పటికీ కలెక్టర్లు రిటర్నింగ్​ అధికారులను నియమించలేదు. నామినేషన్​ పత్రాలు కూడా అందుబాటులో లేవు. దీంతో నామినేషన్​ పత్రాల కొందరు అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వెనుదిరుగుతున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కోసం ప్రభుత్వం వేచి చూస్తున్నట్టు సమాచారం. ఒకవేళ సుప్రీంకనుక ఎన్నికలు నిర్వహించడానికి ఓకే చెబితే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అంగీకరించాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొన్నది. నిజానికి మొదటి దశలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27 నామినేషన్ల దాఖలకు ఆఖరి రోజు సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వచ్చినా జిల్లాల్లో పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన షమీన్‌తాజ్‌ అనే అభ్యర్థిని వచ్చారు.

నామినేషన్‌ పత్రాలు ఇవ్వాలని కోరగా.. తమకు రాలేదని అభ్యర్థికి కార్యాలయం అధికారులు తెలిపారు.. దీంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు.అలాగే సోమందేవపల్లి ఎంపీడీవో కార్యాలయానికి కాంగ్రెస్ అభ్యర్థి రాగా.. నామినేషన్ల పత్రాలు లేవంటూ అధికారులు వెనక్కి పంపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అధికారులు నామినేషన్లు స్వీకరించడం లేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.