Begin typing your search above and press return to search.

పనామా దుమారం;చరిత్రలోనే అతి పెద్ద స్కాం

By:  Tupaki Desk   |   4 April 2016 6:42 AM GMT
పనామా దుమారం;చరిత్రలోనే అతి పెద్ద స్కాం
X
ఇప్పటి వరకూ చాలానే కుంభకోణాలు విని ఉంటాం. కానీ.. చరిత్రలో ఇప్పటివరకూ చూడనంత భారీ కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది. ఈ స్కాం గొప్పతనం ఏమిటంటే.. ఈ స్కాంలో చిక్కుకున్నోళ్లు వివిధ దేశాధినేతలు మొదలుకొని.. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. ఇంతకీ ఈ స్కాంను మూడు ముక్కల్లో చెప్పాలంటే.. పన్నులు ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు తరలించిన నల్ల కుబేరుల జాబితా. ఇలాంటి వారిలో పలువురు దేశాధినేతలు.. క్రీడాకారులు.. సినీ స్టార్స్.. పారిశ్రామికవేత్తలు.. సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన 1.15కోట్ల రహస్య పత్రాలు బయటకు పొక్కాయి.

ఈ పత్రాల్ని పనామాకు చెందిన ప్రముఖ గూడాఛార సంస్థ మొస్సాక్ ఫోన్సీకా లీక్ చేసింది. దీన్ని జర్మనీకి చెందిన ఒక జర్మన్ పత్రిక బయట పెట్టింది. ఇందులో రష్యా అద్యక్షుడు వాద్లిమర్ పుతిన్.. పాక్ ప్రధాని షరీఫ్ తో పాటు పలు దేశాల అధినేతల పేర్లు ఇందులో ఉన్నాయి. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ మొదలు వందలాది క్రీడాకారుల పేర్లు.. సినీ స్టార్లు ఉన్నారు.

మరి.. ఇంత భారీ కుంభకోణంలో.. భారతీయులకు పాత్ర లేదా? అంటే.. అలాంటి సందేహాలు అక్కర్లేదని.. 500 పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ నటుడు జాకీచాన్ మొదలు.. మన బిగ్ బీ అమితాబ్ కూడా ఉన్నారని చెబుతుననారు. దాదాపు ఏడాది పాటు పరిశోధించిన అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కన్సార్టియం ఈ భారీ కుంభకోణాన్ని బయట పెట్టింది.

ఈ స్కాంలో వివిధ దేశాలకు చెందిన 140 మంది రాజకీయ నేతలు.. 12 మంది తాజా మాజీ దేశాధినేతలు ఉండటం గమనార్హం. నల్లధనానికి సంబంధించి 2.14లక్షల సంస్థలకు చెందిన 11.5 మిలియన్ పత్రాలు బయటకు రావటం గమనార్హం.