Begin typing your search above and press return to search.

మే 9న పనామా పేపర్స్ మహా రిలీజ్

By:  Tupaki Desk   |   27 April 2016 4:50 PM GMT
మే 9న పనామా పేపర్స్ మహా రిలీజ్
X
అడ్డదిడ్డంగా సంపాదించిన నల్లసొమ్మును గుట్టుచప్పుడు కాకుండా దేశం సరిహద్దులు దాటించేసిన ఘనుల బాగోతం ‘పనామా పేపర్స్’ రూపంలో బట్టబయలు కావటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టల కన్సార్టియం ఒకటి నెలల తరబడి చేసిన పరిశోధనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల చీకటి బతుకులు బయటకు రావటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కు మరికొద్ది రోజుల్లో ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ఏప్రిల్ 4న బయటకు వచ్చిన పనామాపేపర్స్ కుంభకోణానికి సంబంధించిన 1.15కోట్ల రహస్య పత్రాల్ని ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆఫ్ షోర్ లీక్స్.ఐసీఐజే.ఓఆర్ జీ అన్న పేరిట ఒక వెబ్ సైట్ లో ఈ రహస్య పత్రాల్ని బయట పెట్టనున్నట్లు తాజాగా ప్రకటించారు. పనామా పేపర్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు.. సెలబ్రిటీలు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవటం తెలిసిందే.