Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా ఇంకెంత దూరం?
By: Tupaki Desk | 24 Dec 2015 7:13 AM GMTమూసుకుపోయిన మహాద్వారాలు మళ్లీ తెరుచుకుంటున్నాయా...? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఆశ సజీవంగానే ఉందా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు. అయితే... కేంద్రం - రాష్ట్రం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేలా సైలెంటుగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని తెలిస్తే ఇతర రాష్ట్రాలు తమ డిమాండ్లు వినిపించే అవకాశం ఉండడం... ఏపీలోనూ ఇతర రాజకీయవర్గాలు ఎవరికి వారు అది తమ ఘనతే అని చెప్పుకొనే ప్రయత్నంలో చేసే హడావుడి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావించి రహస్యంగా ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ పాలన కేంద్రం విజయవాడకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియా వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటికే ఆయన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకుని పరిశీలించారని తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా రానుందని పనగరియా సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. విజయవాడలో పనగరియా, చంద్రబాబుల మధ్య భేటీ ఉంటుందంటున్నారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవడంతో పాటు దాన్ని ఎప్పుడు ప్రకటించాలి వంటి అంశాలపైనే వారు మాట్లాడుతారని అంటున్నారు. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే ఏపీ ప్రత్యేక హోదా కల సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.